భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది.దాదాపుగా టోర్నీకి సంబంధించిన పనులన్నీ చకచగా పూర్తవుతున్నాయి.
మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదల అయింది.కానీ ప్రపంచ కప్ లో ఏ టీం ని ఆడించాలనే విషయంలో టీమిండియా కు ఇంకా క్లారిటీ రాలేదని, ఆ విషయం స్పష్టంగా తెలుస్తోందని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ మ్యాచ్ అన్నాక గెలుపు, ఓటములు సహజం.ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తామో లేదంటే ఓడటమో అనే విషయం పక్కన పెడితే.చివరి బంతి వరకు గట్టి పోటీని ఇవ్వాలి.కానీ వెస్టిండీస్ జట్టు( West Indies team ) చేతిలో చాలా ఘోరంగా భారత్ ఓడిపోవడం క్రికెట్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.
ఒకపక్క బ్యాటింగ్లో.మరొకపక్క ఫీల్డింగ్ లో ఘోరంగా ఓడిన భారత జట్టు త్వరలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ప్రత్యర్థి జట్లను ఎలా ఎదుర్కొని ముందుకు వెళుతుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ( Virat Kohli, Rohit Sharma )లకు రెస్ట్ ఇవ్వడం, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, బూమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు గాయపడడం వల్ల రెండో వన్డే మ్యాచ్లో భారత్ చిత్తుగా ఓడింది.
అయితే చాలామంది టీమ్ ఇండియాకు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో క్లారిటీ లేదని అంటున్నారు.టీ20లో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) వన్డే ఫార్మాట్లో పేలవ ఆట ప్రదర్శన చేస్తున్నాడు.కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లేకపోవడం తో మిడిల్ ఆర్డర్లో ఎవరిని ఆడించాలో తెలియక భారత్ రకరకాల ప్రయోగాలు చేస్తోంది.
స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ను పక్కన పెట్టడం ఎందుకని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో టీం లో మార్పులు చేస్తేనే వరుస విజయాలు చేరుతా అవుతాయని, లేదంటే ఇలాంటి ఘోర పరాజయలే ఎదురవుతాయని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.