ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాలను మరొకసారి థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ అయ్యింది.కాగా ఇప్పటికే, ఆరెంజ్, జల్సా, ఖుషి, ఒక్కడు, మురారి, ఆది, త్రీ, బిల్లా, సింహాద్రి లాంటి సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇందులో భాగంగానే ఖుషి సినిమా( Khushi movie ) రీ రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసిన అతికి ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఖుషి చిత్రం రీ రిలీజ్ అవ్వగా దానికి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని ఎన్టీఆర్ బర్త్ డే కి సింహాద్రిని అభిమాన సంఘాలు రిలీజ్ చేస్తే దానికి పెద్దగా కలెక్షన్స్ రాలేదు.

ఎన్టీఆర్( NTR ) వెనకుండి అభిమానుల చేత ఎదురు పెట్టుబడి పెట్టి సింహాద్రిని రీ రిలీజ్ చేయించాడు అంటూ సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ ఎన్టీఆర్ అభిమానులని రెచ్చగొట్టారు.అయినప్పటికీ ఎన్టీఆర్ ఫాన్స్ పవన్ ఫాన్స్ పై విరుచుకుపడుతూ రివర్స్ లో కౌంటర్లు వేశారు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ బ్రో మూవీ ఓపెనింగ్స్ చూసి పగలబడి నవ్వుకుంటున్నారు.పవన్ ఫాన్స్ కి కౌంటర్స్ వేస్తూ సోషల్ మీడియాలో #KingOfOpeningsNTR హాష్ ట్యాగ్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు.
బ్రో ( Bro )మేకర్స్ రికార్డ్ ఓపెనింగ్స్ అంటూ నేడు బ్రో మూవీ కలెక్షన్స్ ని అఫీషియల్ గా ప్రకటించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో మా ఎన్టీఆర్ సినిమాలకు ఇంత వచ్చింది.
మీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంతే వచ్చింది అంటూ ఆ లెక్కలని షేర్ చేస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ హంగామాకి దిగారు.

Day1 collections share
ASVR:-26.6cr
JLK:-21.81CR Janatha Garage :-20.49Cr #Bro:-21 కోట్లు అంతే అంటూ ఎన్టీఆర్ ఫాన్స్( NTR Fans ) రెచ్చిపోయి పవన్ ఫాన్స్ తో వార్ కి దిగారు.అటు పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా ఏ మాత్రం తగ్గడమే లేదు.
వారు #BlockBusterBRO అనే హాష్ టాగ్ తో హల్ చల్ చేస్తుంటే ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం #KingOfOpeningsNTR అనే హాష్ టాగ్ తో రచ్చ చేస్తున్నారు.అలా మొత్తానికి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్లు సాగుతోంది.








