తమిళ దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న సముద్రఖని( Samudrakhani ) ఈమధ్య అతను నటుడిగా మారి అక్కడ ఇక్కడ వరుస సినిమాలు చేస్తున్నాడు.ముఖ్యంగా తెలుగులో అతను ఈమధ్య వరుసగా విలన్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
అయితే అతను ఇప్పుడు తెలుగులో బ్రో సినిమాను డైరెక్ట్ చేశాడు.అంతకుముందు తెలుగులో శంబో శివ శంబో సినిమా( Shambo Shiva Shambo )ను డైరెక్ట్ చేశాడు సముద్రఖని.
అయితే బ్రో మాతృక సినిమా సముద్రఖని తమిళంలో వినోదయ సీతం సినిమా ఆయన డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో సముద్రఖని చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు.సినిమా తనకు ఇచ్చినందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని సూపర్ గా సాటిస్ఫైడ్ చేశాడు.వింటేజ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని చూపించి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సూపర్ ఎనర్జీ నింపాడు.
ఈ సినిమాతో సముద్రఖని తెలుగులో డైరెక్టర్ గా కూడా తన మేనియా కొనసాగించేలా ఉన్నాడు.ఇక నుంచి యాక్టర్ గానే కాదు డైరెక్టర్ గా కూడా సత్తా చాటేలా ఉన్నాడు.
సముద్రఖని తమిళంలో కన్నా తెలుగులోనే కెరీర్ మంచి దూకుడిగా ఉందని చెప్పొచ్చు.ఇక మీదట ఇక్కడ ఆయన వరుస సినిమాలు చేస్తారని చెప్పొచ్చు.