సూపర్ స్టార్‌ సినిమా తెలుగు లో రిలీజ్ అవుతుందా? లేదా?

తమిళ్ సూపర్ స్టార్‌ రజనీకాంత్( Rajinikanth ) తాజా చిత్రం జైలర్( Jailer ) ఆగస్టు 11వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతున్న విషయం తెలిసిందే.నెల్సన్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకి తమిళనాడు లో భారీ క్రేజ్ ఉంది.

 Rajinikanth Jailar Movie Telugu Release , Rajinikanth, Jailar Movie, Bhola Sha-TeluguStop.com

కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా ను పెద్దగా పట్టించుకోవడం లేదు.పైగా అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా విడుదల కాబోతుంది.

కనుక తెలుగు లో జైలర్ సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.ఒకవేళ విడుదలైనా కూడా జైలర్ సినిమా ను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు అనేది అనుమానమే.

ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మధ్య కాలంలో నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

Telugu Bhola Shankar, Jailar, Rajinikanth, Tamannah-Movie

రోబో సినిమా( Robo movie ) తర్వాత తెలుగులో ఆయన నటించిన ఏ సినిమా కూడా మినిమం వసూళ్లు దక్కించుకోలేక పోయింది.అందుకే జైలర్ సినిమాను కొనుగోలు చేసేందుకు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదని ప్రచారం జరిగింది.చిరంజీవి సినిమా కు పోటీగా జైలర్ సినిమా వస్తే వసూళ్లు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు.

అందుకనే జైలర్ సినిమా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించ లేదని.దాంతో సన్ పిక్చర్స్ ( Sun Pictures )వారు డైరెక్ట్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది.

భారీ ఎత్తున కాకుండా ఒక మోస్తరు థియేటర్స్ లో అయినా కూడా జైలర్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతుంది అనేది కన్ఫర్మ్.మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది.

ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది .ఇక్కడ మరో విషయం ఏంటంటే జైలర్ సినిమాలో కూడా హీరోయిన్ తమన్నా అనే విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube