పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: వర్షాల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.శనివారం ఉదయం వేములవాడ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు.

 Collector Anurag Jayanthi Review On Sanitation Works, Collector Anurag Jayanthi-TeluguStop.com

స్థానిక మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి 20 వ వార్డ్ లోని గాంధీ నగర్ నుండి టెంపుల్ వరకు, అక్కడి నుండి గాజుల బజార్ వరకు కాలినడకన తిరుగుతూ… పారిశుద్ధ్యం, నాలాలు,డ్రైనేజీ లు క్లీనింగ్ చేస్తున్నారో లేదో పరిశీలించారు.స్వీపింగ్ ఆక్టివిటీస్ ను పరిశీలించారు.

టెంపుల్ ముగింట ఉన్న పబ్లిక్ టాయిలెట్ పరిశుభ్రతను పరిశీలించారు.కోరుట్ల బస్టాండ్ సమీపంలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసిన పుట్ పాత్ లను పరిశీలించారు.

క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు తీరును స్థానిక మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో పరిశీలించారు.

స్థానిక ప్రజలతో మాట్లాడారు.

మిషన్ భగీరథ నీరు వస్తుందా?చెత్త సేకరణ వాహనం రోజూ మీ ఇంటికి వస్తుందా?మీ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా ?అంటూ ప్రజలను ప్రశ్నించారు.భగీరథ నీరు క్రమ తప్పకుండా వస్తుందని… చెత్త సేకరణ వాహనం రోజూ ఇంటికి వస్తుందని ప్రజలు తెలిపారు.

జ్వరాలు ఎవ్వరికీ లేవని సమాధానం ఇచ్చారు.ఇండ్లలో మంచి నీరు నిల్వకుండా చూడాలన్నారు.

మంచి నీటిలోనే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు.వారంలో ప్రతి మంగళ వారం, శుక్రవారం, ఆదివారం పట్టణంలోని ప్రతి ఇంట్లో ఉన్న నీటి నిల్వలు లేకుండా ఫ్రైడే.

డ్రైడే పాటించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజలకు సూచించారు.వారానికి 3 సార్లు డ్రై డే చేపడితే దోమలు వృద్ధి చెందకుండా , దోమ కాటు రాకుండా నియంత్రించవచ్చని అన్నారు .పరిశుభ్రమైన ఆహారం, తాగు నీటిని మాత్రమే ఈ వర్షాకాలం తీసుకోవాలని సూచించారు.

నిర్లక్ష్యం చేస్తే దోమలు కుట్టి డెంగ్యూ వస్తే చాలా కష్టమని, ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ప్రాణహాని ఉంటుందని ఆయన తెలిపారు.

డ్రై డే లో భాగంగా ప్రతి మంగళ, శుక్రవారం, ఆదివారం మెప్మా రిసోర్స్ పర్సన్, ఏ ఎన్ ఎం లు, ఆశా లు ఇంటింటికి తిరుగుతూ…పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం, కీటక జనిత వ్యాధుల వల్ల కలిగే నష్టాలను వివరించి చైతన్యం చేయాలన్నారు.ఇండ్లలో మంచి నీరు నిల్వ ఉంటే వాటిని పారబోయాలన్నారు.

రోడ్ల కు ఇరు వైపులా డ్రైన్ లలో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందకుండా ద్రావణం పిచికారి చేయాలన్నారు.ఉపయోగంలోనీ బావుల్లో నీరు ఉంటే ఆయిల్ బాల్ లు వేయాలన్నారు.

ఒకవేళ ఎవరికైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సమాచారం అందించాలని చెప్పారు.వారి ఇంటిలోని అందరికి, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయాలని ఆయన అన్నారు.

ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, లార్వాలను గుర్తించి నిర్మూలించాలని ఆయన తెలిపారు.లార్వా ఉన్న చోట యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేయించాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని చెప్పారు.రెండు వారాలకు ఒక్కసారైనా ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.

వర్షాకాలం ముగిసే వరకూ ఇదే విధంగా చేయాలన్నారు.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, జాగ్రత్తలు పాటిస్తూ కాపాడుకోవాలని ఆయన సూచించారు.

వచ్చే రెండు నెలల పాటు పారిశుద్ధ్య చర్యలు అత్యంత కీలకమని చెప్పారు.మురుగుకాల్వల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రం చేయించాలని సూచించారు.

ఖాళీ స్థలాలు, మురుగు నీరు పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ చేపట్టాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube