బ్రో సినిమా విషయంలో మౌనం వహిస్తున్న ఏపీ సర్కార్... అదే కారణమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star Pawan Kalyan ) సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ ఉంటుంది.గతంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్( Bheemla Naik ) సినిమా విడుదలకు ముందు ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిర్మాతలకు నష్టాలను తీసుకువచ్చిందని చెప్పాలి.

 Ap Sarkar Is Silent On Bro Movie ,bro Movie, Pawan Kalyan, Ap Government, Electi-TeluguStop.com

అప్పటివరకు స్టార్ హీరోల సినిమాలు కనుక విడుదలయితే ఏపీలో బెనిఫిట్ షోలు పడేవి ఈ షో కోసం పెద్ద ఎత్తున రేట్లు పెంచేసి సినిమాలను విడుదల చేసేవారు.అయితే భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది 10 సంవత్సరాల క్రితం జీవో వెలుగులోకి తెచ్చి ఈ సినిమా విషయంలో ఆంక్షలు విధించింది.

Telugu Ap, Bheemla Naik, Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కావడంతో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు లేకుండా చేసింది.కనీసం ఉదయం కూడా తొందరగా షోలు పడలేదు.10-11 మధ్య రెగ్యులర్ మార్నింగ్ షోల టైంలోనే సినిమా ప్రదర్శన మొదలైంది.దీనికి తోడు అప్పటికే ఉన్న రెగ్యులర్ రేట్లను కూడా తగ్గించి పడేశారు.

 ఇలా రేట్లను కూడా భారీగా తగ్గించడంతో నిర్మాతలు ఏపీలో ఈ సినిమాని విడుదల చేసి నష్టపోయారని చెప్పాలి.అయితే పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన బ్రో ( Bro ) సినిమా విషయంలో కూడా ఏపీ సర్కార్ ఇలాంటి ఆంక్షలు విధిస్తారని అందరూ భావించారు.

Telugu Ap, Bheemla Naik, Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమా విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి జోక్యం చేసుకోలేదు.వివిధ నగరాల్లో షోలు అయితే ఉదయం 7.30-9 గంటల మధ్య మొదలైపోతున్నాయి.అన్ని చోట్లా ఐదో షో పడుతోంది.

 ఇలా ఈ సినిమా విషయంలో ఏపీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉన్నారని అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎన్నికలు ( Elections ) దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న సమయంలో పవన్ సినిమాను గెలికితే అది తమ పార్టీకే ప్రమాదం కలుగుతుందని భావించి ఈ సినిమా విషయంలో ఏపీ సర్కార్ మౌనం వహించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube