తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాలకి కథలు, మాటలు అందించిన చాలా మంది రైటర్ లు కల క్రమేణా కనుమరుగు అయిపోతున్నారు.దానికి కారణం వాళ్లలో పొటెంషయాలిటీ తగ్గిపోవడమా లేక వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణం గా మారక పోవడమా అనేది ఇక వల్లే ఆలోచించుకోవాలి…అయితే ఇండస్ట్రీ లో మహేష్ బాబు హీరో గా వచ్చిన దూకుడు సినిమా కి మంచి కథ ని అందించిన రైటర్ గోపి మోహన్( Gopimohan ) మళ్లీ పెద్ద సినిమాలకి రైటర్ గా కనిపించడం లేదు.అసలు ఆయన ఇండస్ట్రీ లో ఉన్నారా? లేక ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అయ్యారా? అనేది ఇంకా సరిగ్గా తెలియడం లేదు…ఆయన శ్రీను వైట్ల( srinu vaitla ) డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలకి రైటర్ గా వ్యవహరించాడు…

అందులో ముఖ్యంగా దుబాయ్ శీను,కింగ్,దూకుడు,నమోవెంకటేశ( Namo Venkatesa ),బాద్షా లాంటి సినిమాలు ఉన్నాయి.అయితే ఈయన అప్పట్లో ఒక సినిమాని డైరెక్షన్ కూడా చేయబోతున్నట్టు గా వార్తలు వచ్చాయి కానీ అవి ఇప్పటి వరకు ఇంకా కార్య రూపం దాల్చలేదు.ఇక శ్రీను వైట్ల ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అయిపోయాక ఈయన కూడా అలాగే ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోయారు అంటూ ఇప్పటికే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు…

అయితే నిజానికి ఈయన సునీల్ తో ఒక సినిమా చేయాల్సింది.కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక తన కో రైటర్ అయినా కోన వెంకట్ కూడా పెద్దగా రైటర్ గా రాణించలేకపోతున్నాడు…కానీ ఆయన శిష్యులు అయిన హరీష్ శంకర్, బాబీ లాంటి వారు మాత్రం డైరెక్టర్లుగా మంచి గుర్తింపు పొందుతున్నారు… బాబీ రీసెంట్ గా వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ కొడితే హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు…








