ప్రస్తుత సమాజంలో చాలామంది కష్టపడకుండా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించడం కోసం పలు రకాల అడ్డదారులను ఎంచుకొని చివరికి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు.ఈ మధ్యన మోసాలు, దోపిడీలు లాంటివి పెరుగుతూనే ఉన్నాయి.
అమాయకులను, డబ్బు ఉన్న వాళ్లను ట్రాప్ చేసి దొరికిన కాడికి దోచుకునే దొంగల మధ్య మనం జీవిస్తున్నాం.ఇలాంటి కోవకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా అసిస్టెంట్ జడ్జి( Assistant Judge ) అవతారం ఎత్తి.
భూ వివాదాలను సెటిల్మెంట్ చేస్తానంటూ దొరికిన వారందరినీ నట్టేట ముంచేస్తున్నాడు.చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వేములవాడకు చెందిన నామల నరేందర్ (31)( Namala Narender ) హైదరాబాదులోని రామంతపూర్ భరత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.వ్యసనాలకు బానిసగా మారిన నరేందర్ కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించడం కోసం నకిలీ జడ్జి( Fake Judge ) అవతారం ఎత్తాడు.
గతంలో నరేందర్ పలు ఆస్తుల కేసుల్లో నేరస్తుడిగా జైలు జీవితం కూడా గడిపాడు.జైలు నుండి బయటకు వచ్చాక ఖమ్మం వెళ్లి తాను ఒక అసిస్టెంట్ జిల్లా జడ్జి అని చెప్పుకుంటూ భూ వివాదాలను పరిష్కరిస్తారని చెప్పి బాధితుల నుండి దొరికిన కాడికి దోచుకుని.
మళ్లీ జైలుకు వెళ్లాడు.

జైలు నుండి విడుదలైన తర్వాత అమీర్ పేట్ లోని వెబ్ డిజైనర్ సంతోష్ సహాయంతో నకిలీ ప్రొఫైల్ రూపొందించాడు.ఇక వనస్థలిపురానికి చెందిన గార్లపాటి సోమిరెడ్డికి చెందిన భూ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నాడు.అయితే భూ వివాదం( Land Disputes ) త్వరగా పరిష్కరించాలని సోమిరెడ్డి నరేందర్ ను ఒత్తిడికి గురి చేశాడు.చివరికి తాను మోసపోయిన ని గ్రహించిన సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు నరేందర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ జడ్జి బాగోతం బట్టబయలైంది.నరేందర్ తో పాటు ఇతని దగ్గర గన్ మెన్ గా పని చేస్తున్న మాజీ సైనికుడు చిలకం మధుసూదన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.వీరి దగ్గర నుండి ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్స్, ఒక ఫోర్ వీలర్ వాహనం, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్గిరి పోలీసులు తెలిపారు.







