పవన్ ను ముందు పెట్టి ప్రేక్షకుల్ని మోసం చేశారు.. బ్రోపై ఆడియన్స్ రియాక్షన్ ఇదే!

బ్రో సినిమాకు ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తొంది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించడం వల్ల ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోందని మరొకరు నటించి ఉంటే ఈ సినిమా ఫలితం మరింత దారుణంగా ఉండేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Audience Reaction On Bro Movie Details Here Goes Viral In Social Media , Audien-TeluguStop.com

బ్రో సినిమా( Bro movie ) చూసిన ఆడియన్స్ ఈ సినిమా పవన్ రేంజ్ సినిమా కాదని పవన్ గత సినిమాలలా సైతం ఈ సినిమా లేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పవన్ ను ముందు పెట్టి ప్రేక్షకుల్ని మోసం చేశారని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ అభిమానులలో కొంతమంది సైతం ఈ సినిమ నచ్చలేదని చెబుతున్నారు.బ్రో సినిమా అంచనాలను మించి ఉంటుందని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా మాత్రం అంచనాలను అందుకునే విషయంలో ఫెయిలైంది.

బ్రో సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు సైతం ఆశించిన రేంజ్ లో లేవు.

Telugu Audience, Bro, Samudrakhani, Pawan Kalyan, Peoples-Movie

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ డేట్స్ ఇస్తే ఆ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవడంలో దర్శకుడు సముద్రఖని( Director Samudrakhani ) తడబడ్డాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బ్రో సినిమా రాబోయే రోజుల్లో పుంజుకునే ఛాన్స్ లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బ్రో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది.

పవన్ సైతం తన సినిమాల స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది.

Telugu Audience, Bro, Samudrakhani, Pawan Kalyan, Peoples-Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఎలాంటి కథాంశాలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల కంటే స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పీపుల్స్ మీడియా బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో బ్రో సినిమా తెరకెక్కడం గమనార్హం.

బ్రో సినిమా కమర్షియల్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని భావించిన ఫ్యాన్స్ ఆశలు అడియాశలు అయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube