చిన్న సినిమా పెద్ద సినిమా అయినా ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరగాలంటే టైటిల్ అద్భుతంగా ఉండాలి.టైటిల్ వల్లే ఫస్ట్ డే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నాయి.
అదే సమయంలో టైటిల్( Movie Titles ) వల్లే వివాదాల్లో చిక్కుకున్న సినిమాలు సైతం ఉన్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న టైటిల్స్ ట్రెండ్ నడుస్తోంది.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం చిన్న టైటిల్స్ ను తన సినిమాలకు టైటిల్స్ గా ఫిక్స్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బేబీ మూవీ సక్సెస్ సాధించడంలో ఆ సినిమా టైటిల్ కీలకమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఒకే ఒక్క అక్షరంతో టైటిల్ పెట్టి ఆ సినిమాతో సక్సెస్ సాధించడం అంటే ఒకింత సాహసమనే చెప్పాలి.కొంతమంది డైరెక్టర్లు ఆ సాహసానికి సిద్ధపడుతూ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్నారు.
ఈరోజు థియేటర్లలో విడుదలైన బ్రో మూవీ( Bro Movie ) సింగిల్ లెటర్ తో తెరకెక్కి హిట్ గా నిలిచింది.

ఈ సినిమాకు టాక్ మిక్స్డ్ గా ఉన్నా పవన్ ( Pawan Kalyan ) తన స్టామినాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నితిన్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన సై మూవీ( Sye Movie ) కూడా ఒకే ఒక్క అక్షరంతో తెరకెక్కి అంచనాలను మించి ఆకట్టుకుంది.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కాజల్, రెజీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ అ! టైటిల్ తో( Aa Movie ) తెరకెక్కి సక్సెస్ సాధించింది.

విక్రమ్ ఐ, కళ్యాణ్ రామ్ ఓం, శ్రీను వైట్ల ఢీ, జగపతిబాబు కీ, ఉపేంద్ర రా, ఉపేంద్ర A , ధనుష్ 3, తారకరత్న నో, శ్రీ పూర్ణ మూవీస్ బ్యానర్ పై స్త్రీ తెరకెక్కగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయ్.జి, Q , క్లూ అనే టైటిల్స్ తో కొన్ని సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా చాలామందికి తెలియదు.రాబోయే రోజుల్లో సింగిల్ లెటర్ తో తెరకెక్కే సినిమాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.బ్రో అనే టైటిల్ తో అవికా గోర్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కింది.2021లో విడుదలైన ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు.







