ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెగా మల్టీస్టారర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వినోదయ సీతం( Vinodya Seetham ) రీమేక్ అయినప్పటికీ ముందు నుండి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న బ్రో సినిమా( Bro movie ) ఈ రోజు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూసారు.
మరి ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో హంగామా ఉదయం నుండే స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాక్జ్ పాజిటివ్ బజ్ రావడంతో మాస్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసారు.
ఇక మాస్ థియేటర్స్ లో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ( RTC Cross Roads )లో మెగా ఫ్యాన్స్ మాములు హంగామా చేయడం లేదు.

ఇక అక్కడ మరింత సందడి తీసుకు వచ్చాడు పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్( Akira Nandan ).ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో తండ్రి పవన్ కళ్యాణ్ సినిమాను చూసేందుకు అకిరా ఎంట్రీ ఇచ్చాడు.ఈయన ఎంట్రీతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ చుట్టుముట్టారు.
దీంతో కాసేపు సందడి వాతావరణం నెలకొంది.అకీరాను చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం మాములుగా లేదు.

బ్రో సినిమాను ఫ్యాన్స్ మధ్యలో వీక్షించారు.దీంతో ఈయన అక్కడ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.ఇక సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్ లుగా నటించగా ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా కుమ్మసాడో రేపు తెలుస్తుంది.







