మామూలుగా మనం ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలి అంటే స్పెషల్ గా గిఫ్ట్ లేదంటే సర్ప్రైజ్ ఇచ్చి బర్త్డే విషెస్ ని చెబుతూ ఉంటాం.ఇక సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు( Birthday ) తెలపడంతో పాటు ఖరీదైన బహుమతులను కూడా ఇస్తూ ఉంటారు.
కానీ ఒక హీరో మాత్రం హీరోయిన్ కి ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు.ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విష్ చేసిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఏకంగా హీరోయిన్ కి నగ్న వీడియో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సదరు హీరో.

ఇంతకీ ఆ హీరో ఎవరు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.హాలీవుడ్ హీరోయిన్ సాండ్రా బుల్లక్( Sandra Bullock ) 59వ బర్త్ డే సందర్భంగా నటుడు ర్యాన్ రెనాల్డ్స్( Ryan Reynolds ) చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది.హాలీవుడ్‌లో హీరోయిన్ సాండ్రా బుల్లాక్ తన 59వ పుట్టినరోజును జూలై 26న బుధవారం జరుపుకుంది.
ఈ సందర్భంగా ఆమె అభిమానులు సైతం విషెస్ తెలిపారు.హాలీవుడ్‌లోని పరిశ్రమలోని అనేక మంది స్నేహితులు, సహానటులు విష్ చేశారు.
కానీ ఆమె సహా నటుడు ర్యాన్ రెనాల్డ్స్ పోస్ట్ తీవ్రమైన చర్చకు దారితీసింది.ఆమెకు విష్ చేస్తూ వాళ్లిద్దరు 2009లో కలిసి నటించిన ది ప్రపోజల్( The Proposal ) సినిమాలోను ఒక నగ్న వీడియోను పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆ వీడియోని షేర్ చేస్తూ ర్యాన్ రెనాల్డ్స్ ఇన్‌స్టాలో ఈ విధంగా రాసుకొచ్చారు.అసమానమైన, అద్భుతమైన ప్రతిభ కలిగిన సాండ్రా బుల్లక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ సంవత్సరం మీ పుట్టినరోజు కోసం నేను మా ఇద్దరికీ సాన్నిహిత్యానికి సంబంధించిన సమన్వయకర్తలను పొందాము.వారిలో ఒకరు హెచ్‌ఆర్ విభాగం, రెండోది దుస్తులు? అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హీరో బర్త్డే విషెస్ చెప్పిన విధానం చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు.
హీరో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







