గ్లోబల్ స్టార్ ధనుష్( Dhanush ) ప్రజెంట్ ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తున్నాడు.వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ కేరీర్ లో దూసుకు పోతున్నాడు.
ఇటీవలే ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’( sir ) సినిమా చేయగా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి హిట్ అందుకుంది.
అలాగే కలెక్షన్స్ పరంగా 100 కోట్లను దాటేసి సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత మన తెలుగు ప్రేక్షకులు ధనుష్ సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు.
మరి ధనుష్ సార్ వంటి సినిమాతో మంచి జోష్ లోకి వెళ్లిపోయారు.ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంచి స్వింగ్ లో ఉన్నారు.
ప్రస్తుతం ధనుష్ ‘క్యాప్టెన్ మిల్లర్’( Captain Miller ) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ధనుష్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్( Director Arun Matheswaran ) తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ క్యాప్టెన్ మిల్లర్ పై తమిళ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుండి ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.జులై 28న ధనుష్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసి బిగ్గెస్ట్ ట్రీట్ ను ఫ్యాన్స్ కు అందించారు.

ఈ టీజర్ తో అంచనాలు డబుల్ చేసారు.కోలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లో కూడా యాక్షన్ విజువల్స్ అదిరిపోయాయి.ధనుష్ యాక్షన్ అవతార్ లో అదుర్స్ అనిపించాడు.ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.కాగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







