మెగాస్టార్ చిరంజీవి,( chiranjeevi ) తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన భోళా శంకర్ మూవీ ( Bhola shanker )నుంచి తాజాగా ట్రైలర్ విడుదల కాగా ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.వేదాళం సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కగా మెగా ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి.
ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లకు పెద్ద పీట వేశారు.మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

ట్రైలర్ లో చిరంజీవిని చూసిన అభిమానులు వింటేజ్ మెగాస్టార్ ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భోళా బాయ్ పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో కనిపించనున్నారు.తరుణ్ అరోరా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.తెలంగాణ యాసలో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.శ్రీముఖి ట్రైలర్ లో కొన్ని సెకన్ల పాటు మెరిశారు.

రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడుగా అనే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.కీర్తి సురేష్, సుశాంత్ ట్రైలర్ లో కొన్ని సెకన్ల పాటు మెరిశారు.ట్రైలర్ చివర్లో పవన్ ను ఇమిటేట్ చేస్తూ చిరంజీవి హ హహ అంటూ చెప్పారు.
ట్రైలర్ లో ఎమోషనల్ సన్నివేశాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.చిరంజీవి కామెడీ టైమింగ్ ట్రైలర్ లో అద్భుతంగా ఉంది.
మెహర్ రమేష్( Meher Ramesh ) ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహతి స్వరసాగర్ బీజీఎంతో మెప్పించారు.
ట్రైలర్ కు బీజీఎం హైలెట్ గా నిలిచింది.భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







