హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వాతావరణ శాఖ నగరంలోని అన్ని జోన్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఛార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తో పాటు శేరిలింగంపల్లి జోన్లకు రెడ్ అలర్ట్ ఇచ్చింది.నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు.ఇప్పటికే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
ఈ క్రమంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ సహాయక చర్యలు అందించేందుకు గానూ డీఆర్ఎఫ్ సిబ్బందిని రెడీ చేసింది.ప్రజలకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.







