బీజేపీ లో చేరనున్న కాంగ్రెస్ సీనియర్లు ? 

గతంలో బిజెపిలోకి( BJP ) పెద్ద ఎత్తున బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి చేరికలు కనిపించినా, ఆ తరువాత సీన్ రివర్స్ అయింది.కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్( Congress Party ) తెలంగాణలో బలోపేతం అయినట్టుగానే కనిపించింది.

 Senior Congress Leaders Likely To Join Bjp Party Details, Telangana Congress, Bj-TeluguStop.com

బీఆర్ఎస్ ,బిజెపిలలోని కీలక నేతలు చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా,  మరి కొంతమంది చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే అనూహ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.

గత కొద్దిరోజులుగా చేరికలపై బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారించింది.తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించాలంటే పెద్ద ఎత్తున చేరికలు ఉండాలని నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ లలోని అసంతృప్త నేతలతో తరచుగా సంప్రదింపులు చేస్తూ,  పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.

Telugu Akula Rajender, Dk Aruna, Jaipal Reddy, Kishan Reddy, Telangana-Politics

ఆ ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది.తాజాగా బిజెపి ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తో( DK Aruna ) కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ మంత్రి బాగా రెడ్డి కుమారుడు, మెదక్ డిసిసిబి మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి,  రంగారెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు భేటీ అయ్యారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి( Kishan Reddy ) బాధ్యతలు స్వీకరించడానికంటే ముందుగానే వీరంతా భేటీ అయ్యారట.

వీరి చేరిక దాదాపు ఖాయమైనట్లేనని ప్రచారం జరుగుతుంది.ఈనెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  హైదరాబాద్ కు రానున్నారు.ఆయన సమక్షంలోనే వీరంతా బిజెపి కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నట్లు గా బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.

Telugu Akula Rajender, Dk Aruna, Jaipal Reddy, Kishan Reddy, Telangana-Politics

ఒకవేళ అమిత్ షా ( Amit Shah ) సమక్షంలో కుదరకపోతే , ఢిల్లీకి వెళ్లి అక్కడ అమిత్ షా లేదా జెపి నడ్డాల సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారట.తెలంగాణ బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేందర్ ( Etela Rajender ) కూడా వివిధ ఉమ్మడి జిల్లాల్లోని అధికార బీఆర్ఎస్,  కాంగ్రెస్ నేతలను బిజెపి లో చేర్చుకునే పనిలో ఉన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ పరంగా సంసిద్ధం కావడంలో భాగంగా దాదాపు 20 కమిటీలను నియమించే ఆలోచనతో ఉన్నారు.

ఇక పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు ఉండేలా చూసుకుని ఎన్నికల నాటికి బలమైన పార్టీగా తెలంగాణలో అవతరించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూ ఉంది.చేరికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడంతోపాటు,  పార్టీ నాయకులు మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలను సర్దుబాటు చేసి కొత్త ఉత్సాహం నింపే ప్లాన్ తో ఉన్నారు .ఎన్నికల వరకు ఇదేవిధంగా పార్టీలోకి చేరుకలు ఉండేలా చూసుకుంటే తమకు ఇక తిరుగు ఉండదు అనే లెక్కల్లో కమలనాథులు  ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube