అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ( Joe Biden )కుక్కలంటే ఎంత ఇష్టమో తెలిసిందే.వైట్‌హౌస్‌కు రావడానికి ముందే డెలావర్‌లోని ఆయన ఇంట్లో కుక్కలు వుండేవి.
బైడెన్‌కు వీలు కుదిరినప్పుడల్లా వాటితో గడిపేవారు.కానీ ఇప్పుడు ఆ కుక్కల వల్ల బైడెన్ వ్యక్తిగత సిబ్బంది ఇబ్బంది పడుతున్నారట.
ఆయనకున్న జర్మన్ షెపర్డ్ జాతి కుక్కల్లో ఒకటైన ‘‘కమాండర్’’( Commander ) సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను కరిచినట్లుగా కన్జర్వేటివ్ వాచ్‌డాగ్ గ్రూప్ చెబుతోంది.దాదాపు 10 ఘటనల్లో ఆ కుక్క సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను కరిచినట్లుగా వాచ్‌డాగ్ అంతర్గత ఈమెయిల్స్ చెబుతున్నాయి.
వాషింగ్టన్‌కు చెందిన కన్జర్వేటివ్ గ్రూప్‌కు చెందిన జ్యుడిషియల్ వాచ్ ఈ ‘‘ఈ మెయిల్స్’’ను వెతికిపట్టుకుంది.రెండేళ్ల వయసున్న కమాండర్ .డెలావర్‌లో బైడెన్‌కు చెందిన రెండు ఇళ్లలో వున్న పరిస్థితులకు, వైట్‌హౌస్‌లో వున్న వాతావరణానికి సరిపడకపోవడంతో ఇబ్బంది పడింది.శ్వేతసౌధంలోని సిబ్బంది దానికి కొత్త కావడంతో పలువురిపై అది దాడి చేసినట్లుగా వాచ్ డాగ్ తెలిపింది.

నవంబర్ 2022లో ఓ అధికారి చేయి, తొడపై కమాండర్ కరిచింది.దీంతో ఆయనను వైట్‌హౌస్ వైద్య బృందం( White House Medical Team ) ఆసుపత్రికి తరలించిందట.ఇది జరిగిన ఒక వారం తర్వాత జో బైడెన్ తన భార్య కలిసి నడుస్తూ వెళ్తుండగా.మరొక ఏజెంట్‌పైనా దాడి చేసిన కమాండర్ అతడి తొడపై కరిచింది.
అదే నెలలో కమాండర్ మొరగడంతో భయపడిన ఒక ఏజెంట్ తన కుర్చీని పైకి లేపి దానిని షీల్డ్‌గా ఉపయోగించాల్సి వచ్చిందని ఆ ఈ మెయిల్స్‌లో వుంది.

అక్టోబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు జరిగిన ఈ ఈ మెయిల్స్ సంభాషణల ప్రకారం.వైట్‌హౌస్‌లో ఆరు కుక్క కాటు ఘటనలు చోటు చేసుకున్నాయని వాచ్‌డాగ్ తెలిపింది.అయితే వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఎలిజబెత్ అలెగ్జాండర్( Elizabeth Alexander ) ప్రకారం.
బైడెన్ దంపతులు కమాండర్‌ను అదుపులో పెట్టడానికి దానికి శిక్షణ ఇచ్చేందుకు సీక్రెట్ సర్వీస్‌తో కలిసి పనిచేస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో కమాండర్ పరిగెత్తడానికి, వ్యాయామం చేయడానికి వైట్‌హౌస్‌లో కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
కమాండర్ మంగళవారం వైట్‌హౌస్ మైదానంలో తిరుగుతూ కనిపించింది.







