గోవా బ్యూటీ ఇలియానా( Ileana ) అంటే తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అప్పట్లో కుర్రాళ్ళ క్రష్ గా ఈ బ్యూటీ ఉండేది.
ముఖ్యంగా తన సన్నని నడుము అందాలతో అందర్నీ చూపులు తిప్పుకోకుండా చేసింది.అప్పట్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా బాగా చలామణి చేసింది.
కానీ ఆ హోదాను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది.

కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైంది.ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళగా మళ్లీ కొంతకాలానికి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ అంత సక్సెస్ కాలేకపోయింది.
ఆ సమయంలో తను బాగా లావు అయ్యి కూడా అందరిని ఆశ్చర్యపరిచింది.ఇక మళ్ళీ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయింది.
అక్కడ కూడా అడపాదడపా అన్నట్లు మాత్రమే తన కెరీర్ సాగుతుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బీచ్ లో సందడి చేసే ఫోటోలను బాగా పంచుకుంటుంది.
ఎక్కువగా తన బికినీ అందాలతో రచ్చ చేస్తుంది.అయితే ఇదంతా పక్కన రీసెంట్గా తను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.
పెళ్లి చేసుకోక ముందుకే తల్లి అవ్వడంతో అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.ఇంతకు తండ్రి ఎవరు అని చాలామంది అడిగారు.

దీంతో రీసెంట్ గానే తన తొమ్మిదో నెలలు పడ్డాక తన బాయ్ ఫ్రెండ్ ఫోటో( Ileana Boyfriend ) పంచుకుంది.అతడి డీటెయిల్స్ మాత్రం ఏమి చెప్పలేదు.అది కూడా అందరూ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని అడగటంతోనే అతని ఫోటో బయట పెట్టింది.అతనితో డేట్ కి వెళ్తున్నట్లు షేర్ చేసుకుంది.ఇక డెలివరీ సమయం కూడా దగ్గరికి పడుతుందా సందర్భంగా ప్రతిరోజు తన ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉంది.
తన బేబీ బంప్ ను ఫోటో దింపుతూ బాగా షేర్ చేసుకుంటూ ఉంది.
అయితే తాజాగా మరో ఫోటో పంచుకుంది.అందులో తను అద్దం ముందు నిలబడి బేబీ బంప్ ఫోటో చూయిస్తూ కనిపించింది.
మెరూన్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది.పైగా తన ప్రెగ్నెన్సీ గ్లోయింగ్( Ileana Pregnancy Glowing ) కూడా బాగుందని చెప్పాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో తన అందం మరింత పెరిగిపోవడమే కాకుండా కాస్త చెబ్బి చెబ్బిగా కూడా అనిపించింది.

ఇక ఆ ఫోటో చూసి తన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.ఇక అందరూ తనకు 9 నెలలు పడటంతో కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.ఇక అందరూ పుట్టబోయే బిడ్డ గురించి కూడా కామెంట్లు పెడుతున్నారు.
ఇక పెళ్లికి ముందే బిడ్డను కంటున్నా ఇలియానా.బిడ్డ పుట్టిన తర్వాత తన బాయ్ ఫ్రెండును పెళ్లి చేసుకుంటుందా లేదా.
లేకుంటే ఇలాగే సహజీవనం చేస్తుందా అనేది చూడాలి.ప్రస్తుతం తన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.







