చిరంజీవిపై కేసు కొట్టేసిన హైకోర్టు.. 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ కు ఊరట!

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ లను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని తహతహ లాడుతున్నాడు.అందుకే ఫుల్ ఖుషీగా తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

 Ap High Court Dismissed Case Against Megastar Details, Megastar Chiranjeevi, Ap-TeluguStop.com

అయితే ఈయన సినీ కెరీర్ మంచి ఊపు మీద సాగుతుంటే చిరంజీవికి ఒకప్పటి కోర్టు కేసు వెంటాడుతుంది.

ఎప్పుడో 2014లో పెట్టిన కేసు ఇన్నాళ్లు కోర్టులో మగ్గుతూనే ఉంది.

అయితే ఎట్టకేలకు నిన్నటితో మెగాస్టార్ చిరంజీవికి మోక్షం లభించింది.గత 9 ఏళ్ల క్రితం పెట్టిన కేసు నిన్న హైకోర్టు( AP High Court ) కొట్టేసింది.

అసలు కేసు ఏంటి? ఏం జరిగిందంటే.మెగాస్టార్ ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించారు.

ఆ తర్వాత రాజకీయాల్లో కూడా రాణించాలని కొత్త పార్టీ పెట్టారు.

కానీ 2008లో ప్రజారాజ్యం పార్టీ( Prajarajyam Party ) పెట్టిన చిరు 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు.దీంతో 2014లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఎన్నికల బరిలో నిలిచారు.మరి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం నియమాలు ఉల్లంఘించి రాత్రి 10 వరకు ప్రచార కార్యక్రమాలు చేసారని కేసు నమోదు చేసారు.

ఆ కేసు ఇప్పటి వరకు గుంటూరులో విచారణ జరుగుతుంది.

అయితే ఈ కేసుపై చిరు హైకోర్టుకు వెళ్లడంతో ఊరట లభించింది.చిరంజీవిపై పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది.దీంతో చిరంజీవికి ఇన్నేళ్లకు మోక్షం లభించింది.

ఏది ఏమైనా మెగాస్టార్ కు సినిమాల్లో కలిసివచ్చినంత రాజకీయాల్లో కలిసి రాలేదనే చెప్పాలి.ప్రజెంట్ అయితే ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీదనే ఫోకస్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube