మెగా డాటర్ నిహారిక ( Niharika ) ఈమధ్య కాలంలో తరచూ వార్తలలో నిలుస్తున్నారు.ఇలా ఈమె వార్తలలో నిలవడానికి కారణమేమీ లేదు పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుని పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి తన భర్త వెంకట చైతన్యకు ( Venkata Chaitanya ) విడాకులు ఇవ్వడమే అందుకు కారణం.
ఈ విధంగా ఎంతో అంగరంగ వైభవంగా నిహారిక వివాహం చేసుకున్నప్పటికీ ఈమె వివాహ బంధం కొంతకాలం కూడా నిలవలేదని చెప్పాలి.ఇక తన భర్తకు గత కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నటువంటి నిహారిక ఎట్టకేలకు తనకు విడాకులు( Divorce ) ఇచ్చానని ప్రకటించారు.

ఈ విధంగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమెకు సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.అయితే నిహారిక మాత్రం విడాకుల వార్తలను చాలా లైట్ గా తీసుకున్నారని తెలుస్తుంది.విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేసినటువంటి నిహారిక అనంతరం తన స్నేహితులతో కలిసి ఎంతో చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తరచూ మహాతల్లి ఫెమ్ జాన్వి, వితికా షేర్ ( Vithika Sharu ) వంటి వారితో కలిసి వెకేషన్ లకు వెళ్లడం వారితో కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో నిహారిక వితికా ఇద్దరు కూడా తరచూ జిమ్ లో కష్టపడుతూ భారీగా ఫిట్నెస్ పై దృష్టి సారించారు.ఇలా భారీగా వర్కౌట్ చేస్తూ జిమ్లో తెగ కష్టపడటమే కాకుండా వారికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే నిహారిక నడుం పై వితికా షేర్ ఎక్కి ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా శరీర ఫిట్నెస్ పై దృష్టి పెట్టినటువంటి వీరిద్దరూ భారీ స్థాయిలో కష్టపడుతున్నారని తెలుస్తోంది.ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి వితికా తిరిగి ఇండస్ట్రీలో పలు అవకాశాలను అందుకొని బిజీ అవుతున్నారు.
ఇక నిహారిక సైతం విడాకులు తీసుకున్న తర్వాత ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.ఒకవైపు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూనే మరోవైపు నటిగా కూడా కొనసాగుతున్నారు.








