తన వరాహి యాత్ర( Varahi yatra )తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ వెలిగించిన విమర్శల చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది.వారాహి రెండో విడత యాత్రకుతాత్కాలిక విరామం ఇచ్చిన జనసేనా ని మూడో విడత యాత్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే అధికారపక్షం నుంచి పవన్ పై దాడి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ పవన్ లక్ష్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరనుంచి ముఖ్యమంత్రి వరకూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దూషిస్తూ ఆయన పెళ్లి లపై విమర్శలు చేస్తున్నారు .అయితే ఇది తమ ప్రభుత్వంపై శృతిమించి న విమర్శలు చేస్తున్న జనసేన( Jana sena )కు కౌంటర్ రాజకీయమా లేక పవను రెచ్చగొట్టి చట్టపరిధిలో ఇరికించే వ్యూహాత్మక దాడా అన్న దానిపై కొత్త విశ్లేషణలు వస్తున్నాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan klayan ) ను ఒక పద్ధతి ప్రకారం రెచ్చగొట్టి ఆయన నోటి వెంట వచ్చే అంశాల ఆధారంగా పవన్ చట్టబద్ధంగా ఇరికించేందుకే నయా ఎత్తుగడకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు.ఆ దిశగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే లీగల్ చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం మరికొన్ని విషయాలలో కూడా పవన్ ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది .తెలుగుదేశం నేతల లాగా ఆచితూచి స్పందించడం కాక డైరెక్ట్ అటాక్ చేస్తున్న పవన్ కచ్చితంగా తన వారాహి యాత్ర మూడవ దశలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తారని, అందులో తమకు అనుకూలంగా ఉన్న అంశాలను ఒడిసి పట్టుకొని పవన్ ను ట్రాప్ చేసే ఉద్దేశంతోనే అధికారపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధమైనట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి బట్టి తెలుస్తుంది .ఇప్పటికే రెండు ఎన్నికలు చూసిన జనసేనకు వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని తమ ఉనికి ని ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో చాటుకోవాలన్న దృడ నిశ్చయంతో ఉన్న పవన్ దూకుడైన రాజకీయాలకే సిద్ధపడినట్లు తెలుస్తోంది.మరి ఈ రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలలో అధికార పక్షమై గెలుస్తుందో లేక జనసేనాని పై చేయి సాధిస్తారో చూడాలి.







