మొదటినుంచి ఏపీ అధికార పార్టీ వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగానే రకరకాల విమర్శలతో విరుచుకుపడుతూ వస్తున్నారు ఆ పార్టీ రెబల్ ఎంపీ కృష్ణంరాజు.సందర్భం వచ్చినప్పుడల్లా వైసిపి పైన , ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపైన స్పందిస్తూ ఆ పార్టీని టెన్షన్ పెడుతూ ఉంటారు రఘురామ.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో ఆ విమర్శలు మరింతగా పెంచారు .ప్రస్తుతం అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వివరించారు.రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్( Pili Subhash Chandra Bose ) తన మూడేళ్ల పదవీకాలం ఉంచుకొని కూడా రాజీనామా చేస్తానని ప్రకటించడాన్ని చూస్తే వైసీపీలో తీవ్ర అసంతృప్తి చోటుచేసుకుందనే దానికి ఇది నిదర్శనం అని రఘురామ అన్నారు .

అలాగే సీఎం జగన్ ( CM JAGAN )ఎదురుగా ఎవరు కూర్చోవడానికి వీలు లేకుండా కుర్చీలు వేయడం లేదని , అవతలి వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా పార్టీ దెబ్బ తినే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని రఘురామ విమర్శించారు .ఇప్పటికే అనేకమంది పార్టీ నాయకులు ఎమ్మెల్యే సీట్లను ఖరారు చేసి మూడు పదుల కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు రఘురాము అన్నారు .దీంతో ఎంతమంది టికెట్లను దక్కించుకుంటారు . ఎంతమంది ధనాన్ని రక్షించుకుంటారు అనేది చూడాలని అన్నారు.ప్రస్తుతం సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు.
పెత్తందారులతో పోరాడుతున్నానని చెప్పే జగన్ పక్కనే పెత్తందారులైన సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి , అయోధ్య రామిరెడ్డి , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లను పెట్టుకున్నారని, వీళ్ళను పక్కన పెట్టుకొని ఏ పెత్తందార్లతో జగన్ మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వీళ్ళతో కలిసి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలను దోచుకుంటున్నారని నారా లోకేష్ ( Nara Lokesh )గారు వ్యాఖ్యానించారని, ఇక చంద్రబాబు నాయుడు గారి పల్లకిని మోస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలను ముద్రించడం సిగ్గుచేటని రఘురామ అన్నారు.ప్రస్తుతం జగన్ వ్యవహార శైలి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కలత చెంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని, అనేకమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.







