ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, వర్క్ స్ట్రెస్, ధూమపానం మద్యపానం అలవాట్లు, కాలుష్యం తదితర కారణాల వల్ల చాలా మంది పురుషులు పల్చటి జుట్టుతో బాగా ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని భయపడుతుంటారు.
దీంతో జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.ముఖ్యంగా పెళ్లి కాని వారు అయితే జుట్టు విషయంలో మరింత కేర్ తీసుకుంటారు.
ఎందుకంటే ఈ రోజుల్లో మంచి జాబ్ ఉన్న జుట్టు లేకపోతే మాత్రం అబ్బాయిలకు పెళ్లి కావడం లేదు.
అందుకే చాలా మంది పురుషులకు ( mens )జుట్టు పై మక్కువ ఎక్కువ ఉంటుంది.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు ప్రయత్నించాల్సిందే.ఈ న్యాచురల్ రెమెడీ ఎంతటి పల్చటి జుట్టును అయినా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు( curry leaves ) పొడిని వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి( Neem powder ), వన్ టేబుల్ స్పూన్ వట్టివేరు పొడి( Vattiveru powder ) వేసుకొని.
మూడు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే పల్చగా ఉన్న జుట్టు కొద్దిరోజుల్లోనే ఒత్తుగా తయారవుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.కుదుళ్ళు దృఢంగా మారతాయి.స్కాల్ప్ శుభ్రంగా మారుతుంది.
చుండ్రు సమస్య ఉంటే పరార్ అవుతుంది.కాబట్టి ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడే పురుషులు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
బెస్ట్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







