'బ్రో' సినిమా ఈవెంట్ ఉన్నట్లా? లేనట్లా?

పవన్ కళ్యాణ్, ( Pawan Kalyan )సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రల్లో నటించిన బ్రో సినిమా ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే విడుదల అయిన టీజర్‌.

 Pawan Bro Movie Pre Release Event Rumors , Bro Movie , Tollywood, Pawan Kalyan-TeluguStop.com

ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచిన విషయం తెల్సిందే.అందుకే ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం సాయి ధరమ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పాడు.

Telugu Bro, Chiranjeevi, Pawan Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movi

సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కచ్చితంగా సినిమా ప్రమోషన్‌ లో పవన్‌ పాల్గొంటారు.ఒక ఈవెంట్‌ జరుగబోతుంది.ఆ ఈవెంట్‌ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు అంటూ ప్రకటించాడు.

సినిమా విడుదలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ సమయంలో ఇప్పటి వరకు బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు సంబంధించిన అప్‌డేట్ లేదు.

దాంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియా( Social media )లో ఉన్న బ్రో హంగామా నేపథ్యం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే మరింతగా సినిమా కు ప్రమోషన్ లభిస్తుంది.

Telugu Bro, Chiranjeevi, Pawan Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movi

కనుక ముందు ముందు ప్రయోజనాల దృష్ట్యా సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.కానీ పవన్‌ కి రాజకీయంగా బిజీగా ఉన్న కారణంగా ఆయన వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆయన లేకుండా చేస్తే ఎలా అనుకున్నారో ఏమో కానీ ఈవెంట్‌ ను క్యాన్సిల్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) ఇంటర్వ్యూలతో పాటు కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇంటర్వ్యూలు మరిన్ని రాబోతున్నాయి.ఒక వేళ బ్రో సినిమా కనుక హిట్ అయితే అప్పుడు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు పవన్‌ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరి నుండి సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube