యూట్యూబ్ వీడియోలకు లైక్ లు... 13 లక్షలు మోసపోయిన మహిళ..!!

టెక్నాలజీ అభివృద్ధి చెందాక పనులు సులువుగా ఎలాగవుతున్నాయో అదే రీతిలో అనేక నష్టాలు కూడా వాటిల్లుతున్నాయి.టెక్నాలజీని ఆధారం చేసుకుని హాకర్స్ భారీ ఎత్తున డబ్బులు దోచేస్తున్నారు.

 Likes For Youtube Videos 13 Lakhs Cheated Woman, You Tube, Cyber Scam-TeluguStop.com

ఒకే ఒక్క క్లిక్ తో సంవత్సరాలు తరబడి కష్టపడి దాచుకున్న డబ్బు కూడా పోయే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్నాయి.ఈ క్రమంలో కొంతమంది అత్యాశకు వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటున్నా వాళ్ళు కూడా ఉంటున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అనేది మనిషి జీవితంలో భాగం అయిపోయిన సంగతి తెలిసిందే.దీంతో దీన్ని అదునుగా చేసుకుని హాకర్స్ విపరీతంగా డబ్బులు దోచేస్తున్నారు.

తాజాగా ఈ రకంగానే ఓ మహిళ దగ్గర 13 లక్షల రూపాయలు ( 13 lakh rupees )హాకర్స్ కాజేయడం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh ) నోయిడాకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల పన్నాగాలకు చిక్కింది.ఈ క్రమంలో 13 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.వర్క్ ఫ్రం హోం అనే ఉద్యోగం అంటూ యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే సరిపోతుందని.

సబ్ స్క్రైబ్ చేస్తే డబ్బులు వస్తాయని సదరు మహిళా వాట్సాప్ కి సైబర్ నేరగాళ్లు మెసేజ్ చేయడం జరిగింది.ఆ తర్వాత పెట్టుబడి పెడితే భారీగా డబ్బులు వస్తాయని.

ఆ మహిళను నమ్మించారు.దీంతో ఆమె దగ్గర ఉన్న 7 లక్షలతో పాటు ఆరు లక్షలు బ్యాంకు దగ్గర లోన్ తీసుకొని…మొత్తం 13 లక్షలు సైబర్ నెరగాలకు పంపింది.

ఆ తర్వాత అటేపు నుండి సరైన రెస్పాండ్ కూడా రాకపోవడంతో తాను మోసపోయినట్లు .గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube