అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో సందడి చేసిన సాయి ధరమ్ తేజ్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) ప్రస్తుతం బ్రో సినిమా ( Bro Movie ) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా బ్రో సినిమా ద్వారా ఈయన ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Sai Dharam Tej Made Noise In Arasavelli Suryanarayan, Sai Dharam Tej, Bro Movie,-TeluguStop.com

సముద్రఖని నటించిన వినోదయ సీతం అనే సినిమాని తెలుగులో బ్రో అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక పర్యవేక్షణ చేశారు.

ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తో పాటు నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కూడా నటించిన సంగతి తెలిసిందే.

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొత్తం తన భుజాలపై వేసుకొని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో సాయి ధరంతేజ్ వరుసగా పలు ఆలయాలను సందర్శిస్తూ ప్రత్యేకంగా పూజలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈయన అరసవెల్లి సూర్యనారాయణ ఆలయం ( Arasavelli Suryanarayana Temple ) లో సందడి చేశారు.

ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej-Movie

స్వామివారి దర్శనం అనంతరం సాయి ధరమ్ మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో తాను ఈ ఆలయానికి వచ్చానని అయితే అప్పుడు ఇప్పుడు తనకు దర్శనం మంచిగా జరిగిందని తెలిపారు.ఇకన ఆరోగ్యం గురించి అందరి క్షేమం గురించి దేవుడిని వేడుకున్నానని తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం తన ఆలోచనలన్నీ కూడా బ్రో సినిమా పైనే ఉన్నాయని తెలిపారు.

ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు అయితే ఆ అంచనాలను దాటి ఈ సినిమా హిట్ అవుతుందని ఈ సినిమాలో నేను మా గురువుగారు కలిసి నటించాము అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి సాయి ధరంతేజ్ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube