తమ పిల్లల పుట్టినరోజు వస్తే చాలా మంది తల్లిదండ్రులు హడావుడి చేస్తారు.ఖరీదైన హోటళ్లలో చాలా మంది బంధువులను, మిత్రులను, ఇతర అతిథులను పిలిచి పార్టీ చేసుకోవడానికి సిద్ధం అవుతారు.
అంతే కాదు రిటర్న్ గిఫ్ట్‌లు, అతిథులకు ఇచ్చే ఖర్చు కూడా ఎక్కువే.వారిలో కొందరు ఆసుపత్రులు, అనాథ శరణాలయాలకు వెళ్తారు.
అక్కడి వారికి పండ్లు పంపిణీ చేయడం లేదా ఆహారాన్ని అందించడం వంటి మానవతా దృక్పథంతో కూడిన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు.అయితే ఈ తల్లిదండ్రులు కొత్తగా ఆలోచించారు.
ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ధరలకు టమాట కొనుగోలు చేయలేని పేదల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తన కూతురు పుట్టిన రోజు( Daughter Birthday ) సందర్భంగా 400 కిలోల టమోటాలను( 400Kg Tomatoes ) ఉచితంగా పంపిణీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అంతేకాదండోయ్.ఈయన చేసిన మంచి పనితో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

టమాట రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.ముఖ్యంగా దేశంలోని కొన్ని నగరాల్లో ఏకంగా కిలో ధర రూ.300ల వరకు చేరుకుంది.దీంతో టమాటాలు సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.
కొన్నాళ్లుగా దేశంలోని పేదలంతా టమాట తినడాన్ని తగ్గించారు.ప్రభుత్వం వీటి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది.తమిళనాడు ప్రభుత్వం అయితే రేషన్ షాపుల ద్వారా కిలో టమాటా రూ.60కి విక్రయిస్తోంది.ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో( Hyderabad ) ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు.తన కుమార్తె పుట్టిన రోజును విభిన్నంగా నిర్వహించాడు.

హైదరాబాద్ పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఎమ్ఆర్‌పీఎస్ యువసేన నాయకుడు నల్లా శివ మాదిగకు( Nalla Shiva Madiga ) తన కుమార్తె అంటే చాలా ఇష్టం.ఆమె పుట్టిన రోజు వేడుకను అందరికీ గుర్తుండిపోయేలా చేద్దామని భావించాడు.అదే తరుణంలో ఆయన పేదలు టమాటాలు కొనలేక ఇబ్బంది పడడం గమనించాడు.వెంటనే కుమార్తె పుట్టిన రోజున 400ల కిలోల టమాటాలను ఉచితంగా పేదలకు పంపిణీ చేశాడు.
దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా బాగా వైరల్ అవుతోంది.పేదలకు టమాటాలను ఉచితంగా అందించిన అతడిని అంతా ప్రశంసిస్తున్నారు.ముఖ్యంగా బాగా ధనవంతులు ఇలాంటి సమయాల్లో స్పందించి పేదలకు అండగా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







