ఆ విషయంలో నా భర్త సపోర్ట్ చాలా ఉంది... ట్రోల్స్ పై స్పందించిన కియారా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నటువంటి నటి కియార అద్వానీ ( Kiara Advani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగులో మహేష్ బాబు( Mahesh Babu) హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

 My Husband Has A Lot Of Support In That Matter, Kiara Advani, Siddharth Malhotra-TeluguStop.com

మొదటి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కియార అనంతరం రామ్ చరణ్ (Ramcharan ) హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయారు.

Telugu Game Changer, Kiara Advani, Ram Charan, Shankar, Tollywood-Movie

ఇక చాలా సంవత్సరాల తర్వాత ఈమె మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.రెండేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ( Siddharth Malhotra ) ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వివాహమైనప్పటికీ ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కొన్ని ట్రోల్స్ కూడా ఎదుర్కొంటారు.

Telugu Game Changer, Kiara Advani, Ram Charan, Shankar, Tollywood-Movie

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీయారా పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించే విషయం పట్ల తనపై చాలా విమర్శలు వచ్చాయని తెలియజేశారు.అయితే ఈ విమర్శలు వచ్చిన సమయంలో నా భర్త నాకు అండగా ఉండి తనని ప్రోత్సహించారని ఈమె తెలియజేశారు.పెళ్లి తర్వాత నటించడం అవసరమా అని నాపై ట్రోల్స్ చేశారు.అయితే ఇలాంటి ట్రోల్స్ వచ్చిన సమయంలో సిద్ధార్థ్ నాకు అండగా నిలిచి నెగిటివ్ వ్యక్తుల గురించి పట్టించుకోకూడదు అంటూ పదేపదే చెబుతూ ధైర్యం నింపారు.

అలా తను నాకు అండగా నిలబడటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఈమె తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube