ఆ విషయంలో నా భర్త సపోర్ట్ చాలా ఉంది… ట్రోల్స్ పై స్పందించిన కియారా?
TeluguStop.com
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నటువంటి నటి కియార అద్వానీ ( Kiara Advani ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగులో మహేష్ బాబు( Mahesh Babu) హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
మొదటి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కియార అనంతరం రామ్ చరణ్ (Ramcharan ) హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయారు.
"""/" /
ఇక చాలా సంవత్సరాల తర్వాత ఈమె మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
రెండేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ( Siddharth Malhotra ) ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
వివాహమైనప్పటికీ ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కొన్ని ట్రోల్స్ కూడా ఎదుర్కొంటారు.
"""/" /
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీయారా పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించే విషయం పట్ల తనపై చాలా విమర్శలు వచ్చాయని తెలియజేశారు.
అయితే ఈ విమర్శలు వచ్చిన సమయంలో నా భర్త నాకు అండగా ఉండి తనని ప్రోత్సహించారని ఈమె తెలియజేశారు.
పెళ్లి తర్వాత నటించడం అవసరమా అని నాపై ట్రోల్స్ చేశారు.అయితే ఇలాంటి ట్రోల్స్ వచ్చిన సమయంలో సిద్ధార్థ్ నాకు అండగా నిలిచి నెగిటివ్ వ్యక్తుల గురించి పట్టించుకోకూడదు అంటూ పదేపదే చెబుతూ ధైర్యం నింపారు.
అలా తను నాకు అండగా నిలబడటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఈమె తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.