వెస్టిండీస్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్- వెస్టిండీస్( India – West Indies ) మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం అవ్వనుంది.అయితే తొలి టెస్ట్ లో ఘన విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్టులో తన ఫామ్ కొనసాగించి గెలవాలని పట్టుదలతో ఉంది.
మరొకవైపు తొలి టెస్ట్ లో ఘోర ఓటమిని చవిచూసిన వెస్టిండీస్ జట్టు కనీసం రెండో టెస్టులో మ్యాచ్ గెలవడం లేదంటే డ్రా చేసుకొని పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది.
ఇదిలా ఉండగా ఈ రెండో టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) కి ఎంతో స్పెషల్.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 499 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.నేడు జరిగే మ్యాచ్ తో 500 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు.అయితే గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్లో సెంచరీ నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు.కనీసం ఈ 500వ మ్యాచ్ లోనైన సెంచరీ సాధించి తన ప్రత్యేకతను చాటుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.

విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్( 500th international match ) ఆడనున్న సందర్భంలో క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణులు సైతం సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.ఇక బీసీసీఐ ఒక ప్రత్యేక పోస్టర్ ను రూపొందించి ట్విట్టర్లో షేర్ చేసింది.అందులో ఏం రాసిందంటే.? నీ ప్రయాణాన్ని మెచ్చుకోవడానికి 500 కారణాలు.టీం ఇండియా కోసం 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి అభినందనలు అని రాసుకొచ్చింది.

కోహ్లీ కెరియర్ చూసుకుంటే ఇప్పటివరకు 110 టెస్ట్ మ్యాచ్లు, 274 వన్డే మ్యాచ్లు, 115 టీ20 మ్యాచ్ లతో కలిపి 499 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.విండీస్ తొలి టెస్ట్ లో అర్థ సెంచరీ తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ రెండో టెస్టు మ్యాచ్లో సెంచరీ తో అదరగొట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.మరొక విషయం ఏమిటంటే.? భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ 100వ టెస్ట్ మ్యాచ్.1948లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది.2023లో ప్రస్తుతం జరగనున్న రెండవ టెస్టు మ్యాచ్ వందో టెస్ట్ మ్యాచ్ అవ్వనుంది.







