ఈ రోజు డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి.ఎందుకంటే ఈయన సినిమా గురించిన సందడి మాములుగా లేదు.
ప్రభాస్ ( Prabhas )ప్రజెంట్ నటిస్తున్న అతి ముఖ్యమైన సినిమాల్లో ”ప్రాజెక్ట్ కే’‘( Project K, ) ఒకటి.ఈయన నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రదర్శింప బడుతున్న విషయం తెలిసిందే.
ఇదే మన ఇండియన్ మూవీ ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో మొట్ట మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది.ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ”ప్రాజెక్ట్ కే”.
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అయ్యారు.మరి వీరిలో ఈ ఈవెంట్ కోసం ప్రభాస్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్, కమల్ హాసన్ పాల్గొననున్నారు.

మరి ఇప్పటికే వీరు అక్కడికి చేరుకున్నారు.డార్లింగ్ ఈ ఈవెంట్ లో ఎంట్రీ ఇచ్చిన పిక్స్ వైరల్ కాగా ఇప్పుడు మరి కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి.డార్లింగ్ ప్రభాస్ తో కలిసి లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan )ముచ్చటిస్తున్న పిక్ అంతర్జాలంలో వైరల్ అయ్యింది.ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.
ఇరు హీరోల ఫ్యాన్స్ ఈ సూపర్ క్లిక్ ను తెగ వైరల్ చేసేస్తున్నారు.

ఇక ఇదే ఈవెంట్ లో ఈ సినిమా నుండి టైటిల్ అండ్ టీజర్ రాబోతున్నాయి.అందుకోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.








