వర్షాకాలంలో తరచూ జుట్టు చెడు వాసన వస్తుందా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే!

వర్షాకాలం( Rainy season ) రానే వచ్చింది.అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

 Effective Oil To Get Rid Of Smelly Hair During Monsoon! Smelly Hair, Monsoon,-TeluguStop.com

అయితే వర్షంలో తడవటం వల్ల జుట్టు చెడు వాసన వస్తుంది.ఈ సమస్యను చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేస్తుంటారు.

హెయిర్ వాష్ చేసుకున్నా సరే జుట్టు బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది.దీంతో ఏం చేయాలో తెలియక తెగ కలవర పడుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.

Telugu Care, Care Tips, Oil, Latest, Long, Monsoon, Rainy Season, Smelly-Telugu

ఈ ఆయిల్ జుట్టు నుంచి వచ్చే చెడు వాసనను చాలా సులభంగా దూరం చేస్తుంది.అదే సమయంలో మరెన్నో లాభాలను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు,( Mint leaves ) వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా కలిపి ఒక నైట్ అంతా వదిలేయాలి.

మ‌రుస‌టి రోజు ఈ ఆయిల్ ను స్టవ్ పై పెట్టి స్లో ఫ్లేమ్ పై ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను నైట్ నిద్రించేముందు స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Oil, Latest, Long, Monsoon, Rainy Season, Smelly-Telugu

మరుసటి రోజు మైల్డ్‌ షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా కనుక చేస్తే జుట్టు చెడు వాసన అన్నమాటే అన‌రు.వర్షాకాలంలో జుట్టు చెడు వాసన రాకుండా అడ్డుకునేందుకు ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ ఆయిల్ ను వాడితే చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది.కుదుళ్లకు చక్కని పోషణ అంది ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube