తండ్రిపై పగతో ముగ్గురు కొడుకులను కారుతో గుద్దిన దుర్మార్గుడు.. వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) మనుషుల్లో ఉన్మాదం రోజురోజుకీ భయానకంగా పెచ్చరిల్లుతోంది.రోజూ ఈ రాష్ట్రంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.

 Man Hits 3 Children With Car Over Enmity With Their Father Video Viral Details,-TeluguStop.com

తాజాగా రాష్ట్ర రాజధాని అయిన లక్నోలో మరో భయానక ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఒక తండ్రిపై పగ పెంచుకున్న కారు డ్రైవర్( Car Driver ) అతడి ముగ్గురు పిల్లలు చంపే ప్రయత్నం చేశాడు.

జులై 13న అతడు కారుతో ముగ్గురు పిల్లలను బలంగా ఢీ కొట్టాడు.ఈ తతంగమంతా సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది.

ఈ వీడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అదృష్టవశాత్తూ, పిల్లలు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు.

వారి గాయాల నుంచి కోలుకుంటున్నారు.

వీడియోలో రోడ్డు పక్కన నడుస్తున్న ముగ్గురు పిల్లలను చూడవచ్చు.వారు వెళ్తున్న రోడ్డు మీదే తెల్లటి కారు రావడం కూడా గమనించవచ్చు.ఆ కారు ఒక్కసారిగా టర్న్ తీసుకొని ఆ ముగ్గురు పిల్లలను( Three Children ) బలంగా డాష్ ఇచ్చింది.

ఆ తర్వాత ఆ పిల్లల మీదకు కారు ఎక్కినట్లు తెలిసింది.ఆ పిల్లల వయసు నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య ఉంటుంది, వారిలో చిన్న పిల్లవాడు బాగా గాయాలు కావడంతో లేవలేకపోయాడు.

ఆ పిల్లవాడిని తన అన్నయ్య భుజాలపై వేసుకొని మోసుకెళ్లాడు.ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల వారు వచ్చి చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.

కారు నడిపిన గోవింద్‌ యాదవ్‌పై( Govind Yadav ) వారి తండ్రి వీరేంద్ర కుమార్‌( Virendra Kumar ) ఫిర్యాదు చేశారు.పోలీసులు చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.ఈ ఘటన లక్నోలోని మహిలాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.లక్నో పోలీసులు కేసును ఛేదించి న్యాయం జరిగేలా చూస్తున్నారు.ఇతరులను బాధపెట్టడం ఎప్పుడూ సరికాదు, పిల్లలు ఇప్పుడిప్పుడే కోలుకోవడం మంచి పరిణామం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube