పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ( Bro movie ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.రెండు తెలుగు రాష్ట్రాలలో సాధారణ టికెట్ రేట్లతోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.
సెన్సార్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుంది.సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు యు సర్టిఫికెట్ వచ్చింది.2 గంటల 15 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతోంది.ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ నిడివితో విడుదలవుతున్న పెద్ద హీరో సినిమా బ్రో మాత్రమేనని చెప్పాలి.
తొలి సగం ఎంటర్టైన్మెంట్ తో మలి సగం పూర్తి కథపై ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.పీపుల్స్ మీడియా బ్యానర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
భీమ్లా నాయక్ తర్వాత పవన్( Pawan klayan ) నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసం 110 కోట్ల రూపాయలు ఖర్చైందని సినిమా నిర్మాణం కోసం మాత్రం కేవలం 30 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది.యు సర్టిఫికెట్ తో రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని సమాచారం అందుతోంది.
పవన్ అభిమానులకు ఈ సినిమా పండగ లాంటి మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బ్రో సినిమాలో ప్రియా వారియర్, కేతిక శర్మ( Kritika Sharma ) హీరోయిన్లుగా నటించగా ఈ ఇద్దరు హీరోయిన్లు సైతం ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటామని ఫ్యాన్స్ భావిస్తున్నారు.