కొరటాల శివ( Koratala Shiva ) డైరెక్టర్ గా మారి వరుస హిట్లు కొట్టిన విషయం మనకు తెలిసిందే అయితే చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమా తో ఒక భారీ డిజాస్టర్ ని అందుకున్నారు…అయితే ఒక పెద్ద సక్సెస్ కొట్టడానికి ఎన్టీయార్ తో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు… అయితే ఈ సినిమా డైలాగ్స్ కు సంబంధించి తారక్ కొరటాల శివకు కొన్ని సూచనలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కొరటాల శివ సినిమాలలో డైలాగ్స్ కొంచెం క్లాస్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే.

అయితే దేవర సినిమాలో మాస్ డైలాగ్స్ ఉండేలా చూసుకోవాలని కొరటాల శివకు తారక్ సూచనలు చేశారని తారక్( Tarak ) సూచనలను కొరటాల శివ అంగీకరించారని భోగట్టా.దేవర సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే ఊరమాస్ డైలాగ్స్ ఉండనున్నాయని సమాచారం అందుతోంది.దేవర సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.సెంటిమెంట్ పరంగా ఏప్రిల్ నెల జూనియర్ ఎన్టీఆర్ కు లక్కీ మంత్ కాకపోయినా ఈ సినిమాతో సెంటిమెంట్ కు అతీతంగా సక్సెస్ సాధిస్తానని తారక్ భావిస్తున్నారు.భవిష్యత్తు సినిమాలతో తారక్ చరిత్ర సృష్టిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉండగా తారక్ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అత్యంత భారీ స్థాయిలో ఉంది.

తారక్ రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.తారక్ సొంత బ్యానర్ లో సినిమాలలో నటించడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్( NTR Arts Banner ) టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ బ్యానర్ గా నిలిచేలా తారక్ తన వంతు కష్టపడుతున్నారు.
తారక్ కు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇక ఈ సినిమా తో ఎన్టీయార్ ఒక ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తారు అని అందరూ వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.









