ఆ సీన్ కోసం అన్నం లేకుండా మద్యం తాగుతూనే ఉన్నా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ(Baby) .ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.

 Hero Anand Devarakonda Really Drunk For Baby Movie Said Sai Rajesh Details, Sai-TeluguStop.com

ఊహించని విధంగా కలెక్షన్లను రాబడుతూ సంచలనమైన విజయాలను అందుకుంది.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ సాయి రాజేష్ ఆనంద్ దేవరకొండ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఆనంద్ దేవరకొండ ప్రియురాలు కనిపిస్తారు.

Telugu Baby, Baby Meet, Sai Rajesh, Sai Rajesh Baby-Movie

ఈ సినిమా క్లైమాక్స్ లో ఆనంద దేవరకొండ తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో తన ఊహలలోనే గడుపుతుంటారు.అయితే నిద్రాహారాలు మాని మద్యం తాగుతూ ఉన్నటువంటి వ్యక్తి పాత్రలో నటించారు.అయితే ఈ సన్నివేశం సహజంగా రావడం కోసం ఆనంద్ దేవరకొండ ఉదయం నుంచి అన్నం తినకుండా కేవలం నిజంగానే మందు తాగుతూ నటించారని సాయి రాజేష్ తెలిపారు.

ప్రతిరోజు ఉదయం ఆనంద్ దేవరకొండకు పరగడుపున టకీలా మూడు షాట్స్ వేయించేవారట.రోజంతా వోడ్కాలో కొబ్బరి నీళ్లు కలిపి తాగించారట.

Telugu Baby, Baby Meet, Sai Rajesh, Sai Rajesh Baby-Movie

ఇలా ఆనంద్ దేవరకొండ తాను ఏం అడిగితే అది చేశారని తెలిపారు.ఇక్కడ నిలబడితే రోగాలు వస్తాయేమో అన్న ప్రదేశాలలో కూడా ఈయన నిలబడి సినిమాలో నటించారంటూ ఆయన డెడికేషన్ పట్ల డైరెక్టర్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ సినిమా కోసం ఆనంద్ దేవరకొండ ఇంత ఎఫర్ట్ పెట్టడం వల్లే ఆయనకు అదే స్థాయిలో రిజల్ట్ వచ్చిందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఆనంద్ దేవరకొండ నటన గురించి ఆయన డెడికేషన్ గురించి డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube