యూట్యూబ్ సూపర్ ఫీచర్... అన్ని వీడియోలకు సేమ్ రూల్ ఇక!

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ని ( Youtube ) విశ్వవ్యాప్తంగా వాడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.దాంతో యూట్యూబ్ యాజమాన్యం యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త స్పెసిఫికేషన్స్ పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది.

 Youtube Is Testing New Stable Volume Feature Details, Youtube, Chennal, New Feat-TeluguStop.com

ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం యాంబియంట్ మోడ్, డార్క్ థీమ్ వంటి అదిరిపోయే అప్‌డేట్స్ పరిచయం చేసిన సంగతి విదితమే.ఇక తాజగా వీడియో సెట్టింగ్స్‌లో ‘స్టెబుల్ వాల్యూమ్’( Stable Volume ) పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూట్యూబ్ పరిచయం చేయబోతోంది.

దీనితో సడన్ చేంజ్‌లు లేదా హెచ్చుతగ్గులు లేకుండా వీడియోల అంతటా వాల్యూమ్ ఒకే విధంగా ఉండేలా సెట్ చేసుకొనే వీలుంది.

Telugu Chennal, Sams, Sound, Stable Volume, Ups, Youtube, Youtube Featue, Youtub

ఇకపోతే ఈ ఫీచర్ అధికారికంగా అనౌన్స్ చేయకముందే రెడిట్‌ యూజర్ ఒకరు “స్టెబుల్‌ వాల్యూమ్” సెట్టింగ్‌ను గుర్తించడం విశేషం.ఇదే విషయాన్ని అతగాడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం విశేషం.సాధారణంగా యూట్యూబ్‌లోని ఒక్కో వీడియో ఒక్కో సౌండ్‌తో ప్లే అవుతుంది.

ఒక వీడియో చాలా పెద్ద సౌండ్‌తో, మరికొన్ని తక్కువ సౌండ్‌తో ప్లే కావచ్చు.దీనివల్ల సౌండ్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి.

ఇపుడు అప్‌కమింగ్ “స్టెబుల్‌ వాల్యూమ్” ఫీచర్‌తో అన్ని వీడియోలలో వాల్యూమ్‌ ఒకేలా ఉండేలా సెట్ చేసుకోవచ్చు.తద్వారా సెట్ చేసుకున్న ఒకే సౌండ్‌తో అన్ని వీడియోలు చూసుకోవచ్చన్నమాట.

Telugu Chennal, Sams, Sound, Stable Volume, Ups, Youtube, Youtube Featue, Youtub

స్మార్ట్ టీవీలు, సౌండ్ సిస్టమ్స్‌, రోకు, ఇతర మీడియా ప్రొవైడర్లు ఇలాంటి ఫీచర్లను ఆల్రెడీ పరిచయం చేయగా ఇపుడు యూట్యూబ్‌ కూడా ఈ సౌండ్ లెవలింగ్ ఫీచర్‌ను( Sound Levelling ) లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.వీడియో సెట్టింగ్స్‌లో యాంబియంట్ మోడ్ కింద ఈ ఫీచర్ కనిపించినట్లు యూట్యూబర్ M.బ్రాండన్ లీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.యూట్యూబ్ స్టెబుల్‌ వాల్యూమ్ ఫీచర్ విడుదలను అధికారికంగా ప్రకటించలేదు, కానీ “దిస్ ఈజ్ టెక్ టుడే” ఛానెల్ నడిపే యూట్యూబ్ క్రియేటర్ M.బ్రాండన్ లీతో సహా అనేక మంది యూజర్లు దీనిని గమనించడం ఇపుడు ప్రత్యేకతని సంతరించుకుంది.వీడియోల మధ్య, అలానే ఒకే వీడియోలోని వాల్యూమ్‌లో సడన్ సౌండ్ జంప్‌లను ఆపడానికి ఈ ఫీచర్ నార్మలైజర్, కంప్రెసర్‌గా పనిచేయవచ్చని లీ ఒక ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube