ఆ సీన్ కోసం అన్నం లేకుండా మద్యం తాగుతూనే ఉన్నా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ(Baby) .

ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.

ఊహించని విధంగా కలెక్షన్లను రాబడుతూ సంచలనమైన విజయాలను అందుకుంది.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ సాయి రాజేష్ ఆనంద్ దేవరకొండ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఆనంద్ దేవరకొండ ప్రియురాలు కనిపిస్తారు. """/" / ఈ సినిమా క్లైమాక్స్ లో ఆనంద దేవరకొండ తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో తన ఊహలలోనే గడుపుతుంటారు.

అయితే నిద్రాహారాలు మాని మద్యం తాగుతూ ఉన్నటువంటి వ్యక్తి పాత్రలో నటించారు.అయితే ఈ సన్నివేశం సహజంగా రావడం కోసం ఆనంద్ దేవరకొండ ఉదయం నుంచి అన్నం తినకుండా కేవలం నిజంగానే మందు తాగుతూ నటించారని సాయి రాజేష్ తెలిపారు.

ప్రతిరోజు ఉదయం ఆనంద్ దేవరకొండకు పరగడుపున టకీలా మూడు షాట్స్ వేయించేవారట.రోజంతా వోడ్కాలో కొబ్బరి నీళ్లు కలిపి తాగించారట.

"""/" / ఇలా ఆనంద్ దేవరకొండ తాను ఏం అడిగితే అది చేశారని తెలిపారు.

ఇక్కడ నిలబడితే రోగాలు వస్తాయేమో అన్న ప్రదేశాలలో కూడా ఈయన నిలబడి సినిమాలో నటించారంటూ ఆయన డెడికేషన్ పట్ల డైరెక్టర్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ సినిమా కోసం ఆనంద్ దేవరకొండ ఇంత ఎఫర్ట్ పెట్టడం వల్లే ఆయనకు అదే స్థాయిలో రిజల్ట్ వచ్చిందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఆనంద్ దేవరకొండ నటన గురించి ఆయన డెడికేషన్ గురించి డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్…