ఆకలి రోజురోజుకు మందగిస్తుందా.. అయితే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి!

ఆకలి మందగించడం.( Decreased appetite).చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది.దీన్ని కారణంగా ఏం తినాలన్నా నిరాకరిస్తుంటారు.

 These Tips Help To Increase Appetite And Improve Interest In Eating! Appetite,-TeluguStop.com

నోరూరించే ఆహారం కళ్ళ ముందు ఉన్న అస్సలు తినాలనిపించదు.ఆకలి మందగించడానికి కారణాలు అనేకం.

మానసిక స్థితి, వేలకు ఆహారం తీసుకోకపోవడం, జీవన శైలిలో మార్పులు తదితర కారణాల వల్ల ఆకలి మందగిస్తుంది.దీని వల్ల తినడం మానేస్తే శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందకుండా పోతాయి.

ఫలితంగా జబ్బుల బారిన పడతారు.

Telugu Appetite, Appetite Tips, Tips, Latest-Telugu Health

అందుకే వీలైనంత త్వరగా వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.చాలా మంది ఆకలి లేదని చెప్పి తినడం మానేస్తారు.కానీ అది పొరపాటు.

ఆకలి లేకపోయినా సరే టైమ్ టు టైమ్ కొంచెం అయినా ఫుడ్ ను తీసుకోవాలి.దీని వల్ల నీరసం( Boredom ) రాకుండా ఉంటుంది.

బాడీకి అవసరమయ్యే పోషకాలు అందుతాయి.అలాగే ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి.

తీసుకున్న‌ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.ప్రోటీన్, ఫైబర్ తదితర పోషకాలు ఉండే ఆహారాన్ని ఎంచుకోండి.

నిత్యం వ్యాయామం చేయండి. వ్యాయామం ఆకలి పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

రోజు అరగంట వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాగే బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.

ఇది మంచి ఆరోగ్యంతో పాటు ఆకలి పెంచడానికి మద్దతు ఇస్తుంది.నిద్ర లేకపోయినా సరే ఆకలి మందగిస్తుంది.

కాబట్టి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి.దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

ఆకలిని ప్రేరేపించే హార్మోన్ ఉత్పత్తి రెట్టింపు అవుతుంది.

Telugu Appetite, Appetite Tips, Tips, Latest-Telugu Health

ఖర్జూరాలు( Dates ) ఆకలి పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి.ఆకలి లేని వారు రోజుకు నాలుగు ఐదు ఖర్జూరాలు తింటే మంచి ఫలితం ఉంటుంది.ఇక అల్లం కూడా ఆకలిని పెంచుతుంది.

రోజు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్ ను కలుపుకొని తీసుకోవాలి.ఇలా చేస్తే బాగా ఆకలి వేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube