ప్రభాస్( Prabhas ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ప్రాజెక్ట్ K తో గ్లోబల్ స్టార్ అయ్యాడు.బాహుబలి తరువాత సాహూ, రాధే శ్యామ్ సినిమాలు డిసాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
కానీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.అయితే తాజాగా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.
భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ప్లాప్ కావడంతో వరుసగా ప్రభాస్ కెరీర్ లో మూడు ప్లాప్ లు ఎదురయ్యాయి.అయితే ఆదిపురుష్ సినిమాపై భారీగా ట్రోల్ల్స్ వస్తున్నాయి.
సినిమా విడుదల కాకముందే ఈ సినిమాపై ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి.ఎడిట్ కరెక్ట్ గా లేదని, బొమ్మల సినిమాలా ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి.

ఆ తరువాత ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి.కానీ సినిమా విడుదలయ్యాక మళ్ళీ అవే ట్రోల్ల్స్ మొదలయ్యాయి.అసలు దీన్ని సినిమా అంటారా, హనుమంతుడు ఇలా మాట్లాడుతాడా, ఇలాంటి డైలాగ్స్ చెబుతాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.రామాయణాన్ని ఇలా తీయడం ఏంటని డైరెక్టర్ ని ప్రశ్నిస్తున్నారు.
డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు సెన్సార్ ఈ సినిమాని ఎలా ఆమోదించింది అని ట్రోల్ల్స్ వైరల్ అయ్యాయి.
దీంతో దర్శకులకు, నిర్మాతలకు ఒక మంచి పాఠం నేర్పించింది అంటున్నారు.పిచ్చి డైలాగులు, చెత్త గ్రాఫిక్ పెట్టి సినిమాలు చేస్తే నటపోతామని నిర్మాతలకి కూడా ఈ సినిమా చెప్పిందని అంటున్నారు.
ఈ సినిమా ప్లాప్ తరువాత దర్శకుడు క్షమాపణలు కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు ఆదిపురుష్( Adipursuh ) సినిమా ప్లాప్ అవ్వడంతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఒక సినిమాపై టెన్షన్ పెరిగింది.ఆ సినిమా ఎదో కాదు.అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ-2( Akshay kumar ).ఈ సినిమా కూడా దేవుళ్లు, పూజారుల మీదే ఉంటుందని సమాచారం.ఇప్పటికే ఆదిపురుష్ సినిమాలో దేవుళ్ళని ఇలా చూపించేసరికి అభిమానులు కోపంగా ఉన్నారు.
దీంతో ఓఎంజీ-2 టీం టెన్షన్ పడుతుందట.సెన్సార్ ఈ సినిమాకు నేరుగా సర్టిఫికెట్ ఇవ్వకుండా రివిజన్ కమిటీకి పంపించింది.
కొన్ని డైలాగులను మ్యూట్ చేయాలని చెప్పిందంట.ఓఎంజీ 1 భారీ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమానే తెలుగులో కూడా గోపాల గోపాల పేరుతో రీమేక్ చేసారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించారు.
మరి ఈ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తారేమో చూడాలి.







