కేవలం 36 రోజుల్లో ఆ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్.. గ్రేట్ అనేలా?

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మారుమ్రోగుతున్న డైరెక్టర్ల పేర్లలో లోకేశ్ కనగరాజ్ ( Lokesh kanagaraj )ఒకరనే సంగతి తెలిసిందే.లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన దాదాపుగా అన్ని సినిమాలు హిట్ కాగా ఇతర డైరెక్టర్లకు భిన్నంగా లోకేశ్ కనగరాజ్ అడుగులు వేస్తున్నారు.

 Lokesh Kanagaraj Great Talent Details Here Goes Viral In Social Media , Lokesh K-TeluguStop.com

లోకేశ్ కనగరాజ్ వేగంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఇతర దర్శకులకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు.కార్తీ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ఖైదీ మూవీ కేవలం 36 రోజుల్లో తెరకెక్కడం గమనార్హం.v

Telugu Karthi, Khaidi, Kollywood, Rashmik, Medi, Tollywood-Movie

కార్తీ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ఖైదీ సినిమా(Kaithi ) తెరకెక్కగా ఈ సినిమా షూటింగ్ ఇంత తక్కువ సమయంలో జరిగిందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.లోకేశ్ కనగరాజ్ టాలెంట్ వల్లే ఈ సినిమాను ఇంత తక్కువ సమయంలో తెరకెక్కించడం సాధ్యమైందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లోకేశ్ కనగరాజ్ ఇతర సినిమాలు సైతం తక్కువ సమయంలోనే షూట్ ను పూర్తి చేసుకున్నాయి.

Telugu Karthi, Khaidi, Kollywood, Rashmik, Medi, Tollywood-Movie

36 రోజుల్లో ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ను తీశారంటే లోకేశ్ కనగరాజ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు.లోకేశ్ కనగరాజ్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్టర్ సినిమాను కేవలం 129 రోజుల్లో పూర్తి చేశారు.విక్రమ్ సినిమాను లోకేశ్ కనగరాజ్ కేవలం 110 రోజుల్లో పూర్తి చేశారు.

లియో సినిమాను లోకేశ్ కనగరాజ్ కేవలం 125 రోజుల్లో పూర్తి చేశారట.లోకేశ్ కనగరాజ్ సినిమాలను తెరకెక్కిస్తున్న వేగం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకుంటున్న ఈ దర్శకుడు రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ డైరెక్టర్ ఇతర డైరెక్టర్లకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube