యాపిల్‌ వాచ్‌ కొత్త ఫీచర్‌ ఇపుడు క్రానిక్‌ హార్ట్‌ కండిషన్‌ కూడా తేలికగా ట్రాక్‌ చేయగలదు!

వినియోగదారులను మరింత సంతృప్తి పరచడానికి యాపిల్‌ వాచ్‌( Apple Watch ) రోజురోజుకీ కొత్త కొత్త అప్డేట్స్ తీసుకు వస్తోంది.ఇండియాలో ఆపిల్ కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

 Apple Watch Can Now Easily Track Chronic Heart Conditions Too Details, Technolo-TeluguStop.com

ఈ నేపథ్యంలో భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది.దానితో గుండెకు స్పందలను సంబంధించిన హిస్టరీని చాలా తేలికగా ఇపుడు ట్రాక్‌ చేయవచ్చు.

ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లకు అందుబాటులో ఉండగా ఇపుడు భారతీయులకోసం తాజా అప్డేట్ తీసుకు వచ్చింది.

-Latest News - Telugu

తాజా నివేదికల ప్రకారం చూస్తే… భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు ఇప్పుడు ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.ఇక్కడ ‘AFib’ అనేది క్రానిక్‌ హార్ట్‌ కండిషన్‌ను( Chronic Heart Condition ) తెలియజేస్తుంది.ఇది ఒక రకమైన అరిథ్మియా అని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో గుండె దడ, వేగంగా కొట్టుకోవడం, క్రమరహితంగా కొట్టుకోవడం వంటివాటిని తెలుసుకొనే వీలుంది.ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్‌ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుందనే విషయం తెలిసినదే.

అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు.అదేవిధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.

-Latest News - Telugu

ఇకపోతే యాపిల్‌ వాచ్‌ 4,( Apple Watch 4 ) తర్వాత వాచ్‌ ఏఓస్‌ 9లోని వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ పని చేస్తుందని గుర్తు పెట్టుకోవాలి.ఇండియా ఆపిల్ వాచ్ యూజర్లు ఐఫోన్‌లో ఐఓఎస్‌ 16ని ఉపయోగించాలి.AFib హిస్టరీ ఖచ్చితంగా 22 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అని యాపిల్‌ సపోర్ట్‌ పేజీ స్పష్టంచేసింది, ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.ఈ ఫీచర్ కోసం ఐఫోన్‌లో హెల్త్‌యాప్‌ ఓపెన్‌, బ్రౌజ్ క్లిక్‌ చేసిన హార్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది.

తరువాత AFib హిస్టరీ సెట్‌ చేసిన స్టార్ట్‌ అప్షన్‌పై క్లిక్‌ చేయాలి.తరువాత మీ పుట్టిన తేదీని నమోదు చేసి AFibతో బాధపడుతున్నారని వైద్యుడు నిర్ధారించిన వైనాన్ని ధృవీకరించాలి.

తరువాత AFib చరిత్ర, ఫలితాలు, లైఫ్‌ ఫ్యాక్ట్‌ గురించి మరింత తెలుసుకునేలా కంటిన్యూపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube