తెలంగాణ భాషాసంస్కృతికి పట్టంకట్టిన గూడూరి సీతారాం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రముఖ తెలంగాణ తొలితరం కథారచయిత గూడూరి సీతారాం( Guduri Sitaram ) నీ తెలంగాణ భాషాసంస్కృతులను బతుకులను తన రచనలద్వారా రికార్డు చేశారనీ తెలంగాణ బతుకు కథకుడు గూడూరి సీతారాం రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి డా.వాసరవేణి పర్శరాములు అన్నారు.

 Guduri Sitaram Is The Crowning Glory Of Telangana Language And Culture , Telanga-TeluguStop.com

ఎల్లారెడ్డిపేటలో దుర్గా గుడి ఆవరణలో మంగళవారం రోజున సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ తెలంగాణ కథారచయిత గూడూరి సీతారాం 87వ జయంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ నిజాంకాలంలో భూస్వాముల , పెత్తందార్ల దౌర్జన్యాలను నిరసిస్తూ తెలంగాణ యాసభాషలో రచనలు చేశారన్నారు.1953 నుండి 1965 వరకు” మారాజు” “రంగడు” “రాజమ్మ రాజరీకం” “మేడిపండు” పెళ్లిప్రేమ” “రంగడు” “నారిగాని బతుకు” మొదలగు 80కి పైగా కథలు రాశారని తెలిపారు.సీతారాం గారి గురించి 10వ.తరగతిలో పాఠ్యాంశంగా పెట్టారన్నారు.హనుమాజిపేట సి.నారాయణరెడ్డి, మిద్దె రాములు, ఆడెపు నారాయణలతోపాటుగా గూడూరి సీతారాంగారికి జన్మనిచ్చిందనీ, నిరాడంబరానికి నిలువెత్తు సంతకం గూడూరి సీతారాంగారనీ, 25 సెప్టెంబర్ 2011లో పరమపదించారనీ ఆయన సాహితీసేవలు మరువలేనివని పర్శరాములు అన్నారు.ఈ జయంతి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ దుంపెన రమేష్, గజభీంకార్ అజయ్, మహమ్మద్ దస్తగీర్, మేగి రాజు, నరేశ్ , శ్రీజ, హరికన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube