బిఆర్ ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలి

100 మంది ఓటర్లకు ఒక బిఆర్ ఎస్ పార్టీ( BRS party ) కార్యకర్త పనిచేయాలి అందుకే బూత్ కమిటీల నియామకం.రాష్ట్రం , జిల్లా ,మండలం అప్పుడు ఎట్లుండే తొమ్మిదేండ్లలో ఇప్పుడేట్లుందని ప్రజలకు జెప్పాలే.

 The Development And Welfare Schemes Undertaken By The Brs Party Should Be Explai-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను అభివృద్ధి ని గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్, రాగట్లపల్లి గ్రామాల్లో బిఆర్ ఎస్ పార్టీ బూతు కమిటీ సభ్యులను నియమించడానికి మంగళవారం వెళ్లిన సందర్భంగా ఏర్పాటు చేసిన బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి గ్రామ శాఖ అధ్యక్షులు మాందాటి రాము( Mandati Rama ) అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు , మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వరస కృష్ణ హారి , బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్ పాల్గొని వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిది ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రాష్ట్రం , జిల్లా, మండలం , గ్రామ అప్పుడుఎట్లుండే ఇప్పుడేట్లుందని ప్రజలకు వివరించాలని వారు పిలుపునిచ్చారు.ప్రస్తుతం ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు, కాంగ్రెస్ పార్టీ, పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల పాటు ఉచితంగా మెరుగైన విద్యుత్ ఇస్తే మూడు గంటల విద్యుత్ చాలు అని అంటున్నాడని దేశంలో ఏరాష్ట్రంలో చేపట్టిని అభివృద్ధి పనులు, పలు సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై అనుచితమైన ఆరోపణలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

ఏ ఆపతికి సంపతికి రాని కొత్త బిచ్చగాళ్లు గ్రామాలకు వచ్చి బిఆర్ ఎస్ పార్టీ పై విషం కక్కుతున్నాయని బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు సమిష్టి గా ఉండి గట్టిగా వారికి బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు.రెండు మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉషారుగా ఉండాలని అందుకోసమే 100 మంది ఓటర్లకు ఒక కార్యకర్త పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించడానికి బూతు కమిటీ ల నియామకం అని ఆయన చెప్పారు, మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను రానున్న ఎన్నికల్లో లక్ష మెజారిటీతో మళ్ళీ గెలిపించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప , ఎంపిటీసీ సభ్యులు ఉప్పుల మల్లేశం, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మీసం రాజం , రవి యాదవ్ బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube