కొన్నిసార్లు చిన్న సినిమాలే పెద్ద సినిమాల రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.అలా ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలలో సంచలనం సృష్టించిన సినిమా ఏదనే ప్రశ్నకు బేబీ మూవీ( Baby Movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్యను అందరూ ప్రశంసిస్తుండగా అదే సమయంలో వైష్ణవి చైతన్య పోషించిన పాత్రను మాత్రం బూతులు తిడుతున్నారు.
ప్రస్తుతం ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది.డైరెక్టర్ సాయి రాజేశ్( Director Sai Rajesh ) తర్వాత ప్రాజెక్ట్ లలో సైతం వైష్ణవి చైతన్య నటించనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.బేబి మూవీ విడుదలైన తర్వాత వైష్ణవి చైతన్యకు సినిమా ఆఫర్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయని తెలుస్తోంది.
తెలుగమ్మాయి అయిన వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) తన నటనతో మెప్పించి మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ హీరోయిన్ తొలి రెమ్యునరేషన్( Vaishnavi Chaitanya First Remuneration )) మాత్రం కేవలం 700 రూపాయలు కావడం గమనార్హం.
ఒక ఈవెంట్ లో డ్యాన్స్ చేయడం వల్ల ఈ మొత్తం పారితోషికంగా పొందానని వైష్ణవి చైతన్య వెల్లడించారు.అక్కడినుంచి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వైష్ణవి ఈ స్థాయికి చేరుకున్నారు.
బేబీ సినిమాలో వైష్ణవిని హీరోయిన్ గా ఎంపిక చేసిన సమయంలో చాలామంది సాయి రాజేశ్ కు మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అయితే వైష్ణవి చైతన్య కాకుండా ఎవరు నటించినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వైష్ణవి చైతన్యకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ దర్శకుల సపోర్ట్ ఉంటే ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.