ఈ ప్రపంచంలోని ఎంతోమంది కేటుగాళ్లు డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాల దారులను తమకి అవకాశంగా మలుచుకుంటూ వుంటారు.ఇక్కడ కధ కూడా అలాంటిదే.
అమెరికా( America)లో కరోనా కాలంలో జరిగిన ఒక మోసాన్ని అత్యంత ఘరానా మోసంగా పేర్కొంటున్నారు.పీపీపీ (పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం) లోన్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకుని $200 బిలియన్లను దక్కించుకుని, దానితో లంబోర్ఘినిలు, ప్రైవేట్ జెట్ ఫ్లైట్‌లు, వెకేషన్ హోమ్‌లు, కార్టియర్ ఆభరణాలు కొనుగోలు చేసి, వేలాది మంది మోసగాళ్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్టు ఇటీవల కనుగొన్నారు.
కరోనా సమయంలో అందించిన కోవిడ్ లోన్ స్కీమ్‌ను వారు అక్రమంగా వాడుకొని అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది.
2020, 2021లో అమెరికా ప్రభుత్వం సుమారు $1.2 ట్రిలియన్ నగదు మొత్తాన్ని వివిధ వ్యాపారాల కోసం కోవిడ్ బెయిలౌట్( COVID Bailout ) నగదు కింద కేటాయించింది.ఈ క్రమంలో ఆర్థిక విపత్తు లోన్ ప్రోగ్రామ్, పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ స్కీమ్‌ల కోసం ఈ నిధులను ఖర్చు చేశారు.
అయితే, దీనికి సంబంధించిన స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఎస్‌బీఏ) నుండి వచ్చిన ఒక నివేదిక అమెరికన్ గవర్నమెంట్ కి దిమ్మతిరిగేలా చేసిందట.దీనిలో దాదాపు 17% నిధులు దుర్వినియోగం అయ్యాయని తేటతెల్లం అయింది.
అంటే 200 బిలియన్ డాలర్ల (దాదాపు 16 లక్షల 40 వేల కోట్లు) మేరకు ఫ్రాడ్ జరిగిందని భోగట్టా.
ఈ ఉదంతంలో ఎస్‌బీఏ ఇప్పటికే మాజీ న్యూయార్క్ జెట్స్ వైడ్ రిసీవర్, జోష్ బెల్లామీతో సహా పలువురిని విచారించిందని సమాచారం.ఈ జాబితాలో మాన్‌హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ యజమాని డోనాల్డ్ ఫిన్లీ ఉన్నారు.ఈయన పీపీపీ, ఈఐడీఎల్‌పీ సాయంతో మిలియన్ల డాలర్ల లోన్ తీసుకుని వాటర్ ఫ్రంట్ వీక్షణ కలిగిన డయోనిస్ బీచ్‌లో నాన్‌టుకెట్ ఇంటిని కొనుగోలు చేసాడట.
ప్రస్తుతం మాన్‌హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ మూతబడింది.ఈ మోసానికి పాల్పడినందుకుగాను ఫిన్లీ 30 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించనున్నాడు.అంతేకాకుండా $3.2 మిలియన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది.దీనికితోడు ఆయనపై $1.25 మిలియన్ల మేరకు జరిమానా కూడా విధించారట.