తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీనిధి శెట్టి( Srinidhi shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రీనిధి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కేజీఎఫ్.
మొదట మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన శ్రీనిధి శెట్టి ఆ తర్వాత సినిమా అవకాశాలు హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదటి సినిమాతోనే సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.
మొదటి సినిమా ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడంతో పాటుగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా మారిపోయింది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ సూపర్ స్టార్ యష్ కాంబినేషన్ తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 1,కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలతో ఊహించని విధంగా పాపులారిటీనీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది శ్రీనిధి శెట్టి.
మొదటి సినిమానే భారీగా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు.ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మను అందరూ కేజిఎఫ్ బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీనిధి పెళ్లి చేసుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే.శ్రీనిధి శెట్టి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అంటూ నెట్టింట్లో న్యూస్ తో పాటు ఒక ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది.కాగా శ్రీనిధి తాజాగా తన సోషల్ మీడియా( Social media) ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు నుదుటిన బొట్టు పెట్టుకొని కనిపిస్తోంది.
అయితే ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్స్ ఏంటి శ్రీనిధి శెట్టి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, కనీసం ఎవరికీ తెలియదు.
ఒక్క ఫోటో కూడా రిలీజ్ అవ్వలేదు అని కామెంట్లు చేస్తున్నారు.దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఆమె పెట్టిన ఫోటోకు సమాధానంగా కొన్ని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.కర్ణాటక లోని ఒక కులానికి చెందిన కొంతమంది యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే నుదుటన బొట్టు పెట్టుకుంటారుట.
ఇది ఆచారంలో ఒక భాగమే అని తెలుస్తోంది.అందుకే శ్రీనిధి శెట్టి కూడా అలా నుదుటన బొట్టు పెట్టుకుందని సమాచారం.







