హీరో వేణు తొట్టెంపూడి(Venu Thottempudi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన హనుమాన్ జంక్షన్, స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే వంటి ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
హీరోగా నటించినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి వేణు చెన్నైలో స్థిరపడుతూ వ్యాపార రంగంలో బిజీగా మారిపోయారు.
ఇక చాలా కాలం తర్వాత వేణు రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On Duty) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో సందడి చేసినటువంటి ఈయన సినిమాలలో నటించాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి.ఇలా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే మరోవైపు తన వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా జగపతిబాబు (Jagapathi Babu) తో తనకు ఉన్నటువంటి విభేదాల గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.

జగపతిబాబు గారితో నాకు ఎలాంటి గొడవలు లేవని తెలిపారు.కాకపోతే ఆయన పూచిగా ఒక వ్యక్తికి 14 లక్షలు అప్పు ఇచ్చాను.కానీ ఆ వ్యక్తి తిరిగి నాకు ఇవ్వలేదు.
కనీసం జగపతిబాబు తను డబ్బు ఇచ్చాడా అని కూడా నన్ను అడగలేదు.అయితే ఆ సమయంలో 14 లక్షలు నాకెంతో విలువైనవి.
ఇక ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడం, ఇక జగపతిబాబు కనీసం ఇచ్చారా అని అడగకపోవడంతో అవి రావు అని నిర్ణయించుకున్నాను.ఈ సంఘటన జరిగిన తర్వాత జగపతిబాబు తనతో మాట్లాడటం పూర్తిగా మానేశారు అంటూ ఈ సందర్భంగా ఆయనతో ఉన్నటువంటి మనస్పర్ధలు గురించి వేణు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







