టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటూ పెళ్లి సందడి( Pelli SandaD ) హీరో రోషన్ మేక( Roshann meka ) కి గుర్తింపు లభించింది.ఆ సినిమా హిట్ కాకున్నా కూడా రోషన్ కి దక్కిన క్రేజ్ మరియు బజ్ ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోషన్ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు అంటూ ఆ మధ్య వైజయంతి మూవీస్ వారు ప్రకటించారు.ఆయన తో తాము చేయబోతున్న సినిమా కు సంబంధించిన చర్చలు జరిగాయి.
ఒక పీరియాడిక్ కథ అంటూ కూడా వారు ప్రకటించారు.కానీ ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం అయిన దాఖలాలు కనిపించడం లేదు.ఒక మంచి క్రేజ్ ఉన్న హీరో ఇలా రెండు సంవత్సరాల సమయం వృదా చేసుకోవడం ఎంత బుద్ది తక్కువ విషయమో ఆయనే ఆలోచించుకోవాలి అంటూ కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.అసలు ఇప్పటి వరకు రోషన్ మేక పెళ్లి సందడి తర్వాత చేయబోతున్న సినిమా పై క్లారిటీ రావడం లేదు.
కన్నడ దర్శకుడి తో రోషన్ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి.కానీ అది కూడా స్పష్టత లేదు.దాంతో అసలు రోషన్ కు ఒక ప్లానింగ్ పద్దతి అనేది లేకుండా కెరీర్ లో ముందుకు సాగుతున్నాడా అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
సీనియర్ హీరో అయిన శ్రీకాంత్( Srikanth ) తనయుడు అయిన రోషన్ తన కెరీర్ విషయం లో సరైన ప్లానింగ్ చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు.ముందు ముందు అయినా అతడి యొక్క ప్లానింగ్ బాగుంటే ఇండస్ట్రీ లో అతడు ఒక మాదిరిగా అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.రోషన్ యొక్క సినిమా లు మరియు స్క్రిప్ట్ వ్యవహారాలు చూసుకునేది ఎవరో కానీ ఇప్పటికి అయినా స్పీడ్ పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రోషన్ సినీ కెరీర్ విషయం లో అంతా కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుంది అనేది చూడాలి.