హోదా ఇవ్వండి .. క్రెడిట్ తీసుకోండి ! పురందేశ్వరికి విజయసాయి రిక్వెస్ట్

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి పురందేశ్వరి( Daggupati purndareswari ) వెంటనే వైసీపీపై విమర్శలు వర్షం కురిపించారు.కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ఏపీ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుంది అని, ఏపీలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని, ఏపీలో అభివృద్ధి చోటు చేసుకోలేదని ,ఎన్నెన్నో విమర్శలు చేశారు.

 Give Status Take Credit Vijaya Sai Reddy Request To Purndareswari , Daggupat-TeluguStop.com

పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి( Vijayasai Reddy ) తనదైన శైలిలో సెటైర్లు వేశారు.కేంద్ర ప్రభుత్వం పథకాల క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని , ఆంధ్రప్రదేశ్ కు ఇస్తానని చెప్పిన ప్రత్యేక హోదా ఇవ్వండి,  క్రెడిట్ అంతా మీకే ఇస్తామంటూ విజయ్ సాయి రెడ్డి పురందరేశ్వరిని ఉద్దేశించి విమర్శలు చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, పోలవరం ప్రాజెక్టు,  చెన్నై ,వైజాగ్, కారిడార్ పూర్తి చేయండి, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని,  రైతు సంక్షేమానికి మద్దతు ఇవ్వాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Ap Status, Jagan, Vijauasai Tweet, Visakha Mp Se

నిన్ననే వైసిపి( YCP ) పాలనపై పురందరేశ్వరి తీవ్రంగా విమర్శలు చేశారు.బిజెపిపై కావాలనే వైసిపి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.ఓట్లతో నిమిత్తం లేకుండా ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకరిస్తుందని,  రైతు భరోసా ఇచ్చి డిబిటీలలో కేంద్రం నిధులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అలాగే ఇళ్ల నిర్మాణానికి 9 ఏళ్ల రాష్ట్రానికి 20వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని రాష్ట్రంలో ఇప్పటికే 65% ఇళ్ల నిర్మాణాలు పూర్తయి ఉండాలని,   కానీ 35% కూడా పూర్తి కాలేదని పురందరేశ్వరి పేర్కొన్నారు.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Ap Status, Jagan, Vijauasai Tweet, Visakha Mp Se

ఇక చాలాకాలం వైసీపీలో విజయసాయిరెడ్డి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.గతంలో జగన్ పైన,  వైసిపి ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేసినా విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసేవారు.ఈ మధ్యకాలంలో ఆ స్పీడ్ తగ్గించారు.

మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు.రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకు పడుతున్నారు .వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ గా పోటీ చేసే ఆలోచనతోనూ ఉండడంతో ఆ సీటు పై రాశులు పెట్టుకున్న విజయ్ సాయి రెడ్డి ఇపుడు పురందరేశ్వరుని టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube